Reporter -Silver Rajesh Medak.
తేది -26.06.2024
*డ్రగ్స్ ని రూపుమాపడంలో ప్రతి ఒక్కరు సహకరించండి.జిల్లా ఎస్పీ.డా. బి. బలస్వామి.
- గంజాయి సేవించిన వ్యక్తి మత్తులో ఎన్నో చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది
తమ పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు గమనించాలి లేదంటే తప్పదు మూల్యం
జూన్ 26 న మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం పురస్కారించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంతో డ్రగ్-రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న క్రమంలో మత్తు పదార్థాలను అరికట్టేందుకు యువత/విద్యార్థులు అంతా యాంటీ డ్రగ్స్ కమిటీలలో సభ్యులుగా చేరి యాంటీ డ్రగ్స్ సోల్జర్ గా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
- అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం మెదక్ ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలుర నుండి రాందాస్ చౌరస్తా వరకు. ర్యాలీ నిర్వహణ ర్యాలీను జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ P.S, I.A.S,, జిల్లా ఎస్.పి డా.బి.బాలస్వామి ఐ.పి.ఎస్ జిల్లా జడ్జి,చైర్ పర్సన్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ శ్రీమతి లక్ష్మీ శారద , సిహెచ్ జితేందర్ సెక్రెటరీ సీనియర్ సివిల్ జడ్జి ,జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎస్.మహేందర్,
మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పట్టణాలు, మండలాలలోని పాఠశాలలు, కళాశాలలో విద్యార్థులకు విస్తృత స్ధాయిలో అవగాహన కార్యక్రమాలు, ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా రాందాస్ చౌరస్తాలో మానవహారం నిర్వహించి డ్రగ్ దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాడతామని ప్రతిజ్ఞ చేశారు. మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సంతకాలు సేకరణ నిర్వహించడం జరిగింది.- -మారక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ* మేము మారకద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామి అవుతానని, వీటి వాడకం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి, నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకము, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియపరుస్తానని, డ్రగ్- రహిత సమాజం లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామినౌతానని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి డా.బి.బాలస్వామి ఐ.పి.ఎస్ గారు మాట్లాడుతూ….దేశ భవిష్యత్తును నిర్ణయించే యువత గంజాయి, మత్తుపదార్థాల బారిన పడకుండా వారి భవిష్యత్తు దృష్ట్యా మత్తు పదార్థాల సరఫరా, ఉత్పత్తి చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపి వాటిని యువతకు దూరం చేయాలనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంతో డ్రగ్-రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న క్రమంలో ఈ రోజు ర్యాలీ కార్యాక్రమాన్ని జిల్లా అధికారులతో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అభివృద్ధికి అవరోధంగా గంజాయి మరే ఇతర మత్తు పదార్థాలు లేకుండా చేయ వలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. యువతను ప్రజలను రక్షించవలసిన బాధ్యత మన పైనే ఉందన్నారు. గంజాయి సేవించిన వ్యక్తి మత్తులో ఎన్నో చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు చేసే అవకాశం ఉన్నందున ముందుగానే దాన్ని నిర్మూలించాలన్నారు.- ప్రతి పోలీస్ అధికారి ప్రజలతో సంబంధాలు ఏర్పరుచుకుని గంజాయి మరే ఇతర మత్తు పదార్థాలు సేవించకుండా విక్రయించకుండా నిఘా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు, ఈ విషయం గురించి ప్రజల్లో మెరుగైన చైతన్యం కొరకు పోలీసు కళాబృందం వారిచే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. లాడ్జీలు, బస్టాండ్లు, కాలేజీలు, లేబర్ అడ్డాలు తదితర ప్రదేశాల పై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే యువత గంజాయి, మత్తుపదార్థాల బారిన పడకుండా వారి భవిష్యత్తు దృష్ట్యా మత్తు పదార్థాల సరఫరా, ఉత్పత్తి చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపి వాటిని యువతకు దూరం చేయాలనే లక్ష్యంగా జిల్లా సిబ్బంది పని చేయాలని సిబ్బందిని సూచించారు. అదే విధంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలేజీలపై దృష్టి సారించాలని, గంజాయి అమ్మకాలు, వినియోగం వలన జరిగే పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, ప్రతి గంజాయి రవాణా, సాగుకు పాల్పడే వారి మూలాలను గుర్తించి వారిని పట్టుకోవాలని, గంజాయి రవాణాకు పాల్పడిన నిందితులపై అవకాశాన్ని బట్టి వారిపై పీడీయాక్ట్ లను నమోదు చేయడంతో పాటు గంజాయి నిందితుల నేరాలు కోర్టులో రుజువైయ్యే విధంగా నైపుణ్యంతో కూడిన దర్యాప్తుతో పాటు తగిన సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశ పెట్టాలని సూచించారు. అలాగే గంజాయి వాడే వారి కళ్ళు ఎర్రబడటం, నోరు పొడిబారడం మరియు మగతగా ఉండటం, జ్ఞాపకశక్తి తగ్గడం, బలహీనమైన శరీరాకృతి, హృదయ స్పందన రేటు పెరగడం మరియు తీవ్రమైన వికారం మరియు వాంతులు ఉంటాయి. కాబట్టి యువత పక్కదారి పడుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా లేకపోతే అనేక ప్రమాదాలు జరిగే పరిస్థితులు ఉన్నాయి.
- పిల్లల తల్లిదండ్రులు వారి ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి. తమ పిల్లలు కాలేజీలకు వెళ్తున్నారా లేదా, ఎవరితో తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు అనే అంశాలపై దృష్టి సారించాలి. లేదంటే పిల్లల భవిష్యత్తు పాడైపోతుందని పిల్లల ప్రవర్తనలో ఏమాత్రం తేడా కనిపించినా తల్లిదండ్రులు అప్రమత్తం కావాలని వెంటనే పోలీస్ వారికి తెలియజేయాలని తల్లిదండ్రులు సకాలం లో గుర్తించి పిల్లల భవిష్యత్తును దేశ భవిష్యత్తును కాపాడాలని అన్నారు. ఈ విషయం గురించి ప్రజల్లో మెరుగైన చైతన్యం కొరకు పోలీసు కళాబృందం వారిచే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అభివృద్ధికి అవరోధంగా మత్తు పదార్థాలు లేకుండా చేయ వలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గంజాయి మరే ఇతర మత్తు పదార్థాలు అమ్ముతున్నట్లు రవాణా చేస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే మెదక్ జిల్లాపోలీసు కంట్రోల్ రూమ్ నెంబర్ 8712657888 కు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. గంజాయి మరియు మత్తు పదార్థాల విషయంలో చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలను సిబ్బందికి క్షుణ్ణంగా వివరించడం జరిగింది.
అనంతరం మెదక్ పట్టణంలో గీతా హై స్కూల్ నందు మాదకద్రవ్యాల నిర్మూలన వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ” సాక్ష్యం స్పష్టంగా ఉంది… నివారణ పెట్టుబడి” అనే అంశం పై జరిగిన సమావేశంలో ప్రసంగించిన కలెక్టర్ , జిల్లా జడ్జి,చైర్ పర్సన్, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ శ్రీమతి లక్ష్మీ శారద, సిహెచ్ జితేందర్ సెక్రెటరీ సీనియర్ సివిల్ జడ్జి ,జిల్లా ఎస్పీ,డా.బి.బాలస్వామిఐ.పి.ఎస్ గారు, అనంతరం మాదకద్రవ్యాల నిర్మూలన వ్యతిరేక దినోత్సవ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి,చైర్ పర్సన్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ శ్రీమతి లక్ష్మీ శారద, సిహెచ్ జితేందర్ సెక్రెటరీ సీనియర్ సివిల్ జడ్జి , జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ .ఎస్.మహేందర్ గారు, మెదక్ డి.యెస్.పి శ్రీ.డా.రాజేష్ గారు, జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకృష్ణ గారు ,జిల్లా సంక్షేమ అధికారి బ్రహ్మాజీ గారు ,జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి గారు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుభాష్ చంద్ర గౌడ్ గారు , జిల్లా అధికారులు, వివిధ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, బాల బాలికలు మరియు జిల్లా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.