దళితుల భూమిని ఇప్పించాలని ఎస్సీ కమిషన్ చేర్మెన్ కు వినతి పత్రం
రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) జూన్ 26:- మెదక్ జిల్లా నిజాంపేట మండలం కె.వెంకటాపూర్ చెందిన దళిత భూములు ఆక్రమించుకుంటున్న రామచంద్రారెడ్డి పై చర్యలు తీసుకొనుటకై ఎస్సి.ఎస్టి కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కు వెంకటాపూర్ దళితులు టీఎస్ జిల్లా అధ్యక్షులు గరుగుల శ్రీనివాస్ ఎమ్మార్పీఎస్ నాయకులు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1975 సీలింగ్ యాక్ట్ ప్రకారం దళితులకు ఇచ్చినటువంటి భూములు ప్రస్తుతం సాగు చేసుకుంటున్న 12 ఎకరాల 20 గుంటల భూమిని దళిత కుటుంబాలకు న్యాయంగా వారికే కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.ఆ యొక్క భూమిలో నాలుగెకరాల భూమిలో సాగు చేస్తున్నారు.దళితులకు మిగతా రావాల్సిన భూమి రామచంద్రారెడ్డి దళితులను ప్రలోభాలకు గురి చేస్తూ ఎనిమిదెకరాలు పట్టా చేసుకోవడం జరిగిందన్నారు.ఆ యొక్క భూమి అ అప్పటి ప్రభుత్వం పట్టాలు అందజేసిన దౌర్జన్యంగా ఆక్రమించుకోవడం జరిగిందని తెలిపారు.ఈ గ్రామానికి చెందిన దళితులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్న అట్టి వ్యక్తిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తమ భూమిని తమకు ఇప్పించాలని వెంకటాపూర్ దళితులు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కు విజ్ఞప్తి చేసినట్లు వారు తెలియపరచారు.