“అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేఖ దినోత్సవం” సందర్భంగా నిర్వహించిన అవగాహన ర్యాలీ.
అనకాపల్లి జిల్లా యస్. రాయవరం మండల కేంద్రంలో వైద్య ఆరోగ్యశాఖ మరియు పోలీసు శాఖ సంయుక్తంగా జిల్లా అధికారుల ఆదేశాలు మేరకు సర్వసిద్ది పి.హెచ్. సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్.ఎస్.వి.శక్తి ప్రియ సూచనలు తో “అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేఖ దినోత్సవం” పురస్కరించుకొని ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ క్లినిక్ క్లస్టర్ పర్యవేక్షకులు *డాక్టర్ పి.ఎన్.వి.ఎస్.ప్రసాద్ ఆధ్వర్యంలో *1వాడొద్దు వాడొద్దు..మాదక ద్రవ్యాలు వాడొద్దు ; 2.గంజాయి ఇచ్చు మత్తు…నీ ఆరోగ్యమే చిత్తు ; 3.మాదక ద్రవ్యాలకు చెప్పండి స్వస్తి ..అదే మీ ఆరోగ్యానికి పెద్ద ఆస్తి అనే నినాదాలు తో అవగాహన ర్యాలీ నిర్వహించారు .ఈ కార్యక్రమంలో వీరితో పాటు పి.హెచ్.ఎన్…ఎం.రత్న సఖి ,కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ జి. కొండబాబు , హెల్త్ సెక్రటరీ లు పి.నూకరత్నం , పి.శ్రీరాములు, స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది ,మహిళ పోలీసులు, గ్రామ మహిళ పోలీసు రూప , అంగన్వాడి టీచర్లు , పంచాయతీ సిబ్బంది ,ఆశా కార్యకర్తలు,గ్రామ పెద్దలు,యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పి.ఎన్.వి.ఎస్.ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మాదక ద్రవ్యాలకు బానిసగా మారకుండా మీతో పాటు మీ తోటి స్నేహితులు కు, శ్రేయోభిలాషులకు దీని పై అవగాహన కల్పించాలని తద్వారా మాదక ద్రవ్యాల రహిత సమాజం ను పునర్మించవచ్చునని ముఖ్యంగా యువత మత్తును కల్గించే గంజాయి , హెరాయిన్,నల్లమందు వంటి మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా వుండాలని వీటి వలన చాల సందర్భాల్లో వాహన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం , అలాగే ఉద్యోగ విధుల్లో భాగంగా మెషినరీ లు వద్ద చేస్తున్నపుడు కాళ్ళు ,చేతులు కోల్పోయి అంగవైకల్యం బారిన పడటం , ఇటువంటి నష్టాలు మాదక ద్రవ్యాల సేవనం వలన సంభవించి కుటుంబాలు రోడ్లుపాలు అవ్వటం వుంటుందని కావున మీరందరూ ఈ అలవాట్లు వున్నవారికి ,లేనివారికి అందరికీ అవగాహన కల్పించాలని డాక్టర్ పి.ఎన్.వి.ఎస్.ప్రసాద్ సూచించారు.