స్టాఫ్ డయేరియా” అనే నినాదం తో ఎస్.రాయవరం ఎం.డి. ఓ ఆఫీస్ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులు తో అవగాహన సదస్సు ,ర్యాలీ. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండల అభివృద్ధి అధికారి కార్యాలయ సమావేశం మందిరంలో “స్టాఫ్ డయేరియా” అనే నినాదంతో జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వారి పిలుపుమేరకు మండలాభివృద్ధి అధికారి మరియు ఈ.ఓ.పి.అర్.డి సత్యనారాయణ అధ్యక్షతన ఎం.డి. ఓ .ఆఫీస్ సమావేశ మందిరంలో నిర్వహించిన పంచాయతీరాజ్ శాఖ ,నీటిపారుదల శాఖ మండల అధికారి , వైద్య ఆరోగ్యశాఖ నుంచి పెనుగోల్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజేశ్వరి ,సర్వసిద్ది మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్.వాసంతి ,వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంను ఉద్దేశించి ఎం.డి. ఒ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్మయం తో పని చేసి 0 నుండి 5 సంవత్సరాలు లోపు పిల్లలు డయేరియా బారిన పడకుండా మంచినీరు ఎక్కడ కలుషితం అవుతుందో అక్కడ సమస్యను గుర్తించి తక్షణం పరిష్కరించాలని వారు అన్ని శాఖల సిబ్బందికి సూచించారు. అలాగే ఈ.ఒ.పి.అర్.డి..సత్యనారాయణ గారు మాట్లాడుతూ ప్రతి శాఖ సిబ్బంది సమన్మయం తో ప్రతి వారం ప్రతి సచివాలయం పరిధిలో క్లోరినేషన్ చేయాలని అప్పుడు మాత్రమే ముఖ్యంగా నీటి ద్వారా వ్యాప్తి చెందే అవకాశం వున్న అతిసారం ను నిర్మూలించవచ్చునని వారు ఇంజనీరింగ్ అసిస్టెంట్ లును ఆదేశించారు. అలాగే మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ రాజేశ్వరి , డాక్టర్ ఎన్ వాసంతి మాట్లాడుతూ అతిసార వ్యాధి రాకుండా సక్రమంగా హాండ్ వాషింగ్ చేసుకోవాలని , ప్రతి ఒక్కరు మరగకాచీ చల్లార్చిన నీటిని త్రాగాలనీ ,బయట కలుషిత ఆహారం తీసుకోకపోవటం వల్ల అతిసారం ( డయేరియా ) బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండవచ్చునని డాక్టర్ రాజేశ్వరి ,డాక్టర్ ఎన్ వాసంతి సంయుక్తంగా అవగాహన కల్పించారు. తదుపరి వారి పర్యవేక్షణలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ క్లినిక్ క్లస్టర్ పర్యవేక్షకులు డాక్టర్ పి.ఎన్.వి.ఎస్.ప్రసాద్ ఆధ్వర్యంలో 1.కలుషిత ఆహారం తినొద్దు…డయేరియా బారిన పడొద్దు. 2. బయట ఫుడ్ వద్దు …ఇంటి ఫుడ్ ముద్దు అనే నినాదాలతో ఎం.డి.ఒ గారు , ఈ.ఒ.పి.అర్.డి గారు, పంచాయతీ సెక్రటరీ లు, మహిళ పోలీసులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ లు, వెలుగు సిబ్బంది,హెల్త్ సూపర్ వైజర్ ఆదినారాయణ ,ఎఫ్.డి.పి క్లస్టర్ పర్యవేక్షకులు దేవరాజు ,కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, హెల్త్ సెక్రటరీ లు , ఇతర శాఖల అధికారులు,సిబ్బంది అంత కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు .