మేధా పాఠశాలను ముట్టడించిన ఏబీవీపీ కార్యకర్తలు
యాజమాన్యం తీరుపై ధ్వజం
అర్మాన్ అనే 9 సంవత్సరాల బాలుడి విద్యుత్ షాక్ ఉదంతంపై ఆందోళన
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణం మేధా హై స్కూల్ లో విద్యుత్ ఘాతానికి ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డ అర్మాన్ అనే 9 సంవత్సరాల బాలుడు 5 వ తరగతి విద్యార్థి వ్యవహారంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ స్పందించింది. ఏబీవీపీ విబాగ్ కన్వీనర్ సూర్య ప్రకాష్ ఆధ్వర్యంలో ఏబీవీపీ కార్యకర్తలు బాధిత విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పాఠశాలను ఏబీవీ ముట్టడించి ముందు బైఠాయించి నినాదాలు చేసారు.. ఇటీవలే అర్మాన్ అనే బాలుడుకు ఆవరణలో ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ బాలుడిని తల్లిదండ్రులు వాహనంలో ఆసుపత్రికి తరలించారు. బాలుడు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బాలుడిని హైదరాబాద్ తరలించారు. స్కూల్ సిబ్బందిని వివరణ కోరగా బాలుడు స్కూల్ కి రావడం ఇష్టం లేక స్కూల్ నుండి గోడ దూకి పారిపోయే ప్రయత్నం చేశాడని అబద్ధాలు చెబుతున్నారని, ఈ క్రమంలో కరెంట్ షాక్ తగిలినట్లు అబద్ధాలు చెబుతున్నారని పేర్కొన్నారు. విద్యార్థులపై పాఠశాల వారికి ఉన్న అశ్రద్ధ వల్లే ఈ ఘటన జరిగిందని ఈ పాఠశాలపై చర్యలు తీసుకుని గుర్తింపు ను రద్దు ఏబీవీపీ రంగంలోకి దిగి ఆందోళన చేపట్టింది. ఆందోళన చేస్తున్న ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.. ఈ కార్యక్రమంలో శంషాబాద్ జిల్లా కన్వీనర్ చాకలి మహేష్,ఆల్ ఇండియా RKM కో కన్వీనర్ మణికంఠ, రాష్ట్ర sfd కో కన్వీనర్ ప్రదీప్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అఖిల్, బర్ల శ్రీకాంత్, నవీన్, బాను, వంశీ,రాకేష్, సురేష్, శివ, మహేందర్, శివ, సురేష్, చందు, పవన్, తిరుపతి, చరణ్,