రైతంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతు రుణమాఫీ
రామాయంపేట (స్టూడియో 10 టీవీ ప్రతినిధి) జూన్ 24:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రాంచందర్ గౌడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బిఆర్ఎస్ పార్టీ పదేండ్ల పరిపాలనలో రైతుల రుణమాఫీని వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని పూర్తిగా చెల్లించకుండా తెలంగాణ ప్రజలను రైతులను మోసం చేసిందని రైతులకు చెల్లించిన ఒకటి రెండు వాయిదాలు మిత్తిలకు సరిపోయిందని అన్నారు.అసలు బాకీ రెండింతలు ఐతే ప్రజలకు గుదిబండల తయారయిందని పేర్కొన్నారు.అందుకే ప్రజలు రైతులు ఉద్యోగులు వారికి ఎంతో విశ్వాసం కలిగిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నారని తెలిపారు.2004లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారు సంపూర్ణ రుణమాఫీ చేసి రైతుల చేత శభాష్ కాంగ్రెస్ అని అనిపించుకున్నారని వెల్లడించారు.అదే తరహాలో నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నారు. రాబోయే ఆగస్టు 15 కల్లా తెలంగాణ రైతాంగం రుణమాఫీ రెండు లక్షల వరకు సంపూర్ణంగా మాఫీ చేయడం జరుగుతుందన్నారు.అబద్దాల హరీష్ రావు వెంటనే వెంటనే రాజీనామా చేయాలి తక్షణమే రెండు లక్షల రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని నీకు ఎలాంటి గౌరవం ఉన్న విలువలు ఉంటే వెంటనే రాజీనామా చేయాలని అన్నారు.మళ్లీ వచ్చే ఎన్నికల్లో బై ఎలక్షన్ లో కూడా మాట ఇచ్చావా ఆ మాట ప్రకారం నువ్వు అంత గట్టిగా అంతా పట్టుగా ఎందుకు ఉన్నావు.మాకు కూడా తెలుసు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాల్లో డొల్లతనం ఏడు లక్షలు కోట్ల అప్పులు కరెంటు మరియు కార్పొరేషన్.అప్పులు ఎన్నో లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయని దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ భూములు ఎన్నో అమ్మి వేయంగా కూడా ప్రభుత్వ ఖజానా ఖాళీ ఉన్న దృష్టిలో పెట్టుకొని రెండు లక్షల రైతు రుణ మాఫీని లాంటి పరిస్థితిలో ఒక ఆదరణ దృష్టిలో పెట్టుకొని కచ్చితంగా నువ్వు మాట్లాడడం జరిగినదన్నారు.ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని ఎవరు ఆపలేరని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో తొనిగండ్ల ఎంపిటిసి నాగులు జిల్లా కార్యదర్శి బైరం కుమార్ జిల్లా సేవాదళ్ అధ్యక్షులు జహీరుద్దీన్ కోనాపూర్ సొసైటీ డైరెక్టర్ సిద్ధ రాములు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.