స్టూడియో10టీవీ టెక్కలి ప్రతినిధి – శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాలి లో టెక్కలి సహాయ కార్మిక అధికారి ఆర్. రాధా కుమారి, జిల్లా బాలల రక్షణ విభాగం కౌన్సిలర్ డి. సీతారాములు, మండల విద్యాశాఖ అధికారి ఎస్. అప్పలరాజు, చైల్డ్ హెల్ప్ లైన్ ప్రతినిధి నాయుడు, స్థానిక హెచ్. సి. కె గణేష్, సమగ్ర శిక్ష పరిధిలో పనిచేస్తున్న సి ఆర్ ఎం టి లు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు సంయుక్తంగా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై ర్యాలీ నిర్వహించారు. అలాగే పలు దుకాణాలు లో బాల కార్మికుల విషయమై తనిఖీలు నిర్వహించారు. 18 ఏళ్ల లోపు బాల బాలికలంతా బడిలోనే ఉండాలని, పనిలో పెట్టుకోరాదని దుకాణ యజమానులకు సూచించారు.