రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) జూన్ 24:- మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో సోమవారం రోజున ఉదయం 11.30 గంటలకు మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ దేవేందర్ తెలిపారు. ఈ సమావేశానికి మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ అధ్యక్షతన వహించిన్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రామాయంపేట మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనుల విషయంలో ఆమోదం తెలుపనైనదన్నారు. అత్యవసర విభాగం క్రింద సీజనల్ వ్యాధులు వర్షాకాలంలో ప్రజలకు ప్రబలకుండా పట్టణ వీధులలో దోమల మందు పిచికారీ, ఫాగింగ్, బ్లీచింగ్ లతో పాటు త్రాగు నీటి సమస్య వీధి దీపాల మరమ్మతుల విషయంలో చర్చించిన్నట్లు ఆయన తెలిపారు. 15 వ ఆర్థిక సంఘం నిధుల నుండి ప్రతి వార్డుకు 10.00 లక్షల చొప్పున పలు అభివృద్ధి పనులకు తీర్మానించి ఆమోదించనైనదని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్,ఎఈ మరియు మున్సిపల్ కౌన్సిలర్లు,కో ఆప్షన్ మెంబర్లు పాల్గొన్నట్లు ఆయన తెలియపరచారు.