రేషన్ కార్డులు, పెన్షన్లు కట్..తేల్చేసిన మంత్రి

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అర్హులకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

సొంత నియోజకవర్గం పాలేరులో పొంగులేటి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం చాలా మంది అనర్హులు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారని.. రాష్ట్రంలో అనర్హులను గుర్తించి వారందరికీ రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు తొలగిస్తామని మంత్రి తెలిపారు

ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా రూ.2 లక్షల రైతు రుణ మాఫీ చేస్తామని, రుణమాఫీ ప్రాసెస్‌ను వచ్చే నెల నుండి ప్రారంభిస్తామని క్లారిటీ ఇచ్చారు. రెండు లక్షల రుణమాఫీకి తెలంగాణ కేబినెట్ సైతం ఆమోదం తెలిపిందనే విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వం పేదలకు గజం స్థలం కూడా ఇవ్వలేదని మేం మాత్రం అర్హులైన పేదలందరికీ ఇళ్లు నిర్మిస్తామని పొంగులేటి హామీ ఇచ్చారు. పాలేరులో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి చెప్పుకొచ్చారు.

ఇక రైతు రుణమాఫీ కోసం తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. రూ.2 లక్షల లోపు రైతు రుణాలను ఏక కాలంలో మాఫీ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. ఇందుకోసం నిధుల సమీకరణకు రేవంత్ సర్కారు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. రుణమాఫీ కోసం రూ.31 వేల కోట్లు అవసరమని అంచనా వేస్తున్న ప్రభుత్వం.. రూ.10 వేల కోట్ల మేర రుణాలు సేకరించేందుకు ఆర్బీఐ అనుమతి కోరింది. మిగతా మొత్తాన్ని వివిధ మార్గాల్లో సర్దుబాటు చేసే ప్రయత్నాల్లో ప్రభుత్వం బిజీగా ఉంది.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!