Reporter -Silver Rajesh Medak.
తేదీ: 24-06-2024
ప్రజావాణిలో వచ్చిన సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి
ఒకే సమస్య పై పలుమార్లు కలెక్టర్ కార్యాలయానికి వచ్చే ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చేపట్టాలి :: జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ వెంకటేశ్వర్లు
మెదక్,జూన్ -24
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వర పరిష్కారం చూపాలని జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ వెంకటేశ్వర్లుఅధికారులను ఆదేశించారు.
సోమవారం మెదక్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల సమస్యలకు సంబంధించిన 206 దరఖాస్తులను అదనపు కలెక్టర్ రెవిన్యూ స్వీకరించారు. ప్రజల నుండి అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించుటకు సంబంధిత శాఖలకు కలెక్టర్ తెలిపారు.
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యతతో వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశించారు. శాఖల వారిగా పెండింగ్ లో ఉన్న సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు.
పెన్షన్-20, ఉద్యోగాల కొరకు,16
ధరణి-50, 2BHK-50, ఇతర సమస్యలు-70 మొత్తం-206
దరఖాస్తులు.
ఈ ప్రజావాణి కార్యక్రమంలోజడ్పీ సీఈఓ ఎల్లయ్య,డి ఆర్ డి ఓ పి డి శ్రీనివాసరావు,కలెక్టరేట్ ఏవో యూనస్,సంబంధిత ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.