అక్కన్నపేట గ్రామంలో సఖికేంద్రం ఆధ్వర్యంలో మహిళలకు అవగాహన
రామాయంపేట (స్టూడియో 10 టీవీ ప్రతినిధి) జూన్ 24:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం, అక్కన్నపేట గ్రామంలో సఖి అవగాహన కార్యక్రమం, మరియు సురక్షిత గ్రామ కార్యక్రమం గత రెండు రోజుల నుండి నిర్వహించడం జరిగిందని జిల్లా సఖి కేంద్రం కేస్ వర్కర్ యం. కళావతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గృహహింస వరకట్న వేధింపులు బాల్య వివాహాలు బాల కార్మికులు, మానవ అక్రమ రవాణా, యాసిడ్ దాడులు, అత్యాచారాలు ప్రేమా ప్రలోభాలు వలన చాలావరకు మిస్సింగ్ కేసు లు, కిడ్నాప్ కేసులు ,ఫోక్స్ కేసులు నమోదు అవుతున్నాయని పేర్కొన్నారు. వీటి వలన అమ్మాయిలను, మహిళలను అక్రమ రవాణా చేసి వ్యభిచార గృహాల్లోకి అమ్మి వేస్తున్నారని అదేవిధంగా అబ్బాయిలను కర్మాగారాలు, బాల కార్మికులుగా మారుస్తున్నారని తెలిపారు. పిల్లలకు చిన్న వయస్సులో పెళ్లిళ్లు చేయడం వలన కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయన్నారు. బాల్య వివాహాల నిషేధ చట్టం గురించి తెలపడం జరిగింది, మరియు బాలబాలికలు అక్రమ రవాణా చేసి ప్రమాదాలకు గురి చేస్తున్నారని తెలిపారు. ఈ ప్రమాదాలు ఎక్కడివారి నుండో కాకుండా మనకు తెలిసిన వారే నమ్మించి మోసం చేస్తున్నారని కావున గ్రామంలో ఒక అవగాహన గల తల్లి ఏవిధంగా వుండాలి,అలాగే అవగాహన గల తండ్రి మరియు అవగాహన గల బాలిక, అవగాహన గల బాలుడు, యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్ అనేది పిల్లలకు తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలి, ఇతర పిల్లలను పోలుస్తూ నువ్వు ఇలాగే చేయాలని చెప్పకుండా పిల్లల సమస్యలను అర్థం చేసుకోవాలి, మరియు వారితో మాట్లాడడానికి ఉదయం, సాయంత్రం సమయం కేటాయించాలని పేర్కొన్నారు. ఇలా చేయడం వలన పిల్లల సమస్యలను తన తల్లిదండ్రులతో చెప్పుకోవడానికి ముందుకు వస్తారు, మరియు చదువు మీద దృష్టి పెట్టగలుగుతారు, పిల్లలు మహిళల సమస్యలు పరిష్కరించుకోవడానికి సఖి కేంద్రం 24 గంటలు ఓకే పై కప్పు క్రింద సమీకృతంగా 5 రకాల ఉచిత సేవలు అందిస్తుందన్నారు. సఖి కేంద్రం వారు బాధిత మహిళ గాయాలతో వచ్చినప్పుడు మెడికల్ సపోర్ట్ మరియు సైకో సోషల్ కౌన్సిలింగ్, లీగల్ కౌన్సిలింగ్ (మహిళలకు బాలికలకు ఉన్న చట్టాల పై) పోలీస్ సపోర్ట్, బాధిత మహిళకు కుటుంబ సపోర్టు లేకుండా ఎక్కడికి వెళ్లలేని పరిస్థితిలో ఉన్న వారికి తాత్కాలిక వసతి, గృహహింస జరిగినప్పుడు రెస్క్యూ వెహికల్ వచ్చి కావాల్సిన సహకారాన్ని అందించడం జరుగుతుందన్నారు. మహిళలకు, బాలికలకు, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు 181, 112, 1098, 18004198588, 1930 మొదలెగున్న టోల్ ఫ్రీ నెంబర్లను సంప్రదించాలని అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి పారా మెడికల్ సిబ్బంది మంజుల, జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ హెచ్ఎం రామాయంపేట డాక్టర్ కళ్యాణి ఏఎస్ఐ మహిళ కానిస్టేబుల్, పంచాయతీ సెక్రటరీ సరిత అంగన్వాడి టీచర్లు- విజయ, పద్మ, అంజమ్మ, వివో ఏలు- యాదగిరి, అనిత,గ్రామ ఏఎన్ఎం,ఆశ కార్యకర్తలు లక్ష్మి, రాణి, మానస మరియు మహిళలు పురుషులు పాల్గొన్నారని తెలిపారు.