చెంచు గిరిజన గుడాల అభివృద్ధికి.బడ్జెట్ కేటాయించివారి కుటుంబాలను ఆదుకోవాలి

చెంచుగూడెంలో తాగునీరు,విద్యుత్, ఉపాధి,తో పాటు పౌష్టికాహారాన్ని అందించాలి కొమరం భీమ్ ఆదివాసి గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి

ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్నారుట్ల, పెదారుట్ల గ్రామాల్లో_ కొమురం భీం ఆదివాసి గిరిజన సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు వై ఆశీర్వాదం కుడుముల వెంకటేశం. టీటీడీ ప్రెసిడెంట్. పులిచెర్ల.గురవయ్య
వారు కలిసి.చెంచు గిరిజనుల సమస్యలను తెలుసుకోగా కొన్ని గూడే లో తాగటానికి మంచినీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని. ఉపాధి కల్పించాలని పొలాలకు పట్టాలు ఉన్నప్పటికీ వ్యవసాయం చేసుకొనుటకు మా దగ్గర పనిముట్లు లేవు అని వేదారుట్ల గిరిజనులు మాట్లాడుతూ. మేముండే చోట ఉపాధి లేదని. కుటుంబ సభ్యులు పెరగడంతో కుటుంబం భారంగా మారింది విషయాలను ప్రకాశం జిల్లా కలెక్టర్ కి గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ గారికి మా యొక్క సమస్యలను వివరించగా స్పందించిన కలెక్టర్ అధికారులకు నివేదిక ఇచ్చారు మార్కాపురం డిఎఫ్ఓ ఇక నుంచి కాల్ చేసి మీరు వెళ్తే కేంద్ర ప్రభుత్వం మీకు 15 లక్షల డబ్బులు ఐదు ఎకరాల పొలం అన్ని రెండు మూడుసార్లు మాట్లాడడం జరిగింది. మాకు సాయం చేయాలని డిఎఫ్ కు ఉన్నప్పటికీ దోర్నాల తహసీల్దార్ ఆ బీటు గార్డు మేము పెదాలుట్లో లేమని ఉండమని తప్పుడు రిపోర్టు పంపించారని అయితే మాకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటు కార్డు, ఇవన్నీ పె పెదారుట్ల గ్రామం పేరు మీద ఉన్నాయని మాకెందుకు రికార్డులు సాయం చేయట్లేదని వాపోయారు ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.


చినారుట్ల గ్రామంలో చెంచు గిరిజనులు మాట్లాడుతూ మాకు నెలరోజుల నుంచి తాగటానికి నీళ్లు లేవని. దాదాపు రెండు కిలోమీటర్లు అడవిలోకి వెళ్లి వాగులో నీళ్లు తెచ్చుకుంటున్నామని ఆ నీళ్లు తీసుకు వచ్చేటప్పుడు మా ఆడవారిని మా పిల్లల్లో మమ్ములను చాలా సందర్భాల్లో ఎలుగుబండ్లు చిరుతపులులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయని ఇలా ఉంటే గూడెం లో ఉన్న సోలార్ రిపేర్ కావడంతో కరెంటు లేక నైట్ పూట ప్రాణాల వారి చేతిలో పెట్టుకొని బతుకుతున్నామని. ఇదిలా ఉంటే ఉంటున్న రూములన్ని పడిపోయాయని ఇళ్లల్లో భయభయంగా బ్రతుకుతున్నావని. మా గూడెంలో కొత్తగా పెళ్లి అయిన యువకులు ఉన్నారని వారికి ఇంతవరకు రేషన్ కార్డులు లేవని. కొంతమందికి ఉన్న మా యొక్క కార్డులకు 10 కేజీలు 5 కేజీలు బియ్యం మాత్రం ఇస్తున్నారని. ఉపాధి లేక తినడానికి తిండి లేక ఇబ్బందులకు గురి అవుతున్నామని. ఇలా ఉంటే మా గూడెంలో ఆరవ తరగతి వరకు గుడెము లో ఒక్క పూట మాత్రమే పిల్లలకు భోజనం పెడుతున్నారని రెండు పూటలు భోజనం సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని వ్యవసాయం చేసుకుని పొలాలు ఉన్నప్పటికీ మాకు పట్టాలు ఉన్నప్పటికీ వ్యవసాయం చేసుకొని నాకు ఎద్దులు ట్రాక్టర్స్ బ్రతకనికి ఉపాధి కల్పించాలని కొంతమందికి స్థలాలు ఇచ్చినప్పటికీ ఇళ్ళ కట్టెయ్యలేదని ఒకే ఇంట్లో పదిమంది ఉన్నామని. వాపోయారు. అధికారులు మాకు మంచి నీళ్లు సోలార్ సిస్టం పేరు చేయించి ఎంచాలని మా
చెంచుకుంట సుద్దకురవ. బంధం భాయ్ చెరువుగూడెం నందిగూడెం. ఈ చెంచు గిరిజన గూడాలలో ఇవి సమస్యలు అధిక శాతం ఉన్నాయని.. అధిక శాతం చెంచులు సరైన పౌష్టికాహారం లేక గిరిజనులు మహిళలు స్త్రీలు చిన్న పిల్లలు వృద్ధులు ఉపాధి లేకపోవడంతో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని.


కొంతమంది స్త్రీలకు 60 ఏళ్లు దాటినప్పటికీ పింఛన్ సౌకర్యం లేదని వారిలో ఒంటరి మహిళలు వితంతువులు వికలాంగులు ఉన్నారని. అధిక శాతం ఇప్పటికీ ఓటు కార్డు రేషన్ కార్డు లబ్ధి పొందని వారు చెంచు గూడా లో అనేకమంది ఉన్నారని. కొత్త గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గిరిజన చెంచు గూడలో వారి సమస్యలను రికార్డుల ద్వారా ఒక సర్వే చేయించి. తమరు గిరిజన తెగకు సంబంధించిన చెంచు గిరిజన జాతి అంతరించిపోకుండా ఆకలి చవులను ఆపాలని ఆదివాసి గిరిజన బిడ్డగా తమరు మంత్రి అయినందుకు గిరిజనుల తరపున తమరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అభివృద్ధి కోసం కృషి చేయాలని గిరిజన కుటుంబాలను ఆదుకుండే విధంగా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గిరిజనుల అభివృద్ధి కోసం. ప్రకాశం కర్నూల్ గుంటూరు ఈ జిల్లాలో సంబంధించి ఐటీడీఏ ప్రాజెక్టు కి బడ్జెట్ కేటాయించడంలో గత ప్రభుత్వం విఫలమైందని చెంచులు అభివృద్ధికి నోచుకోలేదని తమరు పెద్దమనిషి చేసుకొని బడ్జెట్ కేటాయించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆకలిని వారి అభివృద్ధిని వారి కుటుంబాలను కాపాడాలని ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కొమరం భీం ఆదివాసి చెంచు గిరిజన సంక్షేమ సంఘం కోరడమైనద కుటుంబాలను కొత్త ప్రభుత్వ ఉన్న ఆదుకోవాలని మా ఐటీడీఏ ప్రాజెక్టు కి బడ్జెట్ కేటాయించి మా చెంచు గిరిజన జాతి అంతరించిపోకుండా. మమ్ములను కాపాడాలని కోరారు. కొమరం భీం ఆదివాసి చెంచు.గిరిజన సంక్షేమ సంఘంకుడుముల వెంకటేశం. భ్రమరాంబ. గంగన్న. చినారుట్ల టీటీడీఏ ప్రెసిడెంట్ పులిచెర్ల గురవయ్య. పులిచెర్ల వెంకటేశం. వెంకన్న. వీరన్న. దాసరి అంకన్న..వెంకటేశం చెంచు గిరిజన మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!