Reporter -Silver Rajesh Medak.
తేది -21/6/2024.
ప్రభుత్వ విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు జిల్లా పాలన అధికారి తీసుకుంటున్న చర్యలు క్షేత్రస్థాయిలో సత్ఫలితాలనుస్తాయని మెదక్ జిల్లా టీచర్స్ అసోసియేషన్ యూనియన్ పేర్కొన్నారు.
శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకృష్ణ ఆధ్వర్యంలో టీచర్స్ అసోసియేషన్ సభ్యులు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
బడిబాట సాంగ్ రూపొందించిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి కలెక్టర్ ను అభినందించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఉపాధ్యాయ సంఘాలకు తగు సూచనలు చేస్తూ నాణ్యమైన గుణాత్మక విద్యను అందించుటకు
విశేష కృషి చేయాలని హైస్కూల్లో పని చేస్తున్న సైన్స్ మ్యాక్స్ ఉపాధ్యాయులకు ఈ విద్యా సంవత్సరం ఆ సబ్జెక్టులలో అవగాహన సదస్సులు ఏర్పాటు
చేయాలన్నారు. తద్వారా ఉత్తమ ఫలితాలు సాధ్యపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
బడిబాట కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడమే కాకుండా క్షేత్రస్థాయిలో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో నైపుణ్యం గల
ఉపాధ్యాయులతో విద్యాబోధన చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లేందుకు సలహాలు సూచనలు అందించడం ద్వారా సాధ్యపడుతుందని చెప్పారు.
బడిబాట కార్యక్రమం పై
వీడియో సాంగ్ రూపొందించి ప్రచారం చేయడం ద్వారా విద్యతోనే
నైతిక విలువలు ఏర్పడతాయని సమాజంలో విద్య యొక్క పాత్ర ఎంత ముఖ్యమైనదో విద్యార్థి దశ నుండే వీటి ప్రాముఖ్యత గురించి వివరించి ప్రచారం చేయడం ప్రభుత్వ విద్యా ప్రమాణాలపై వారికున్న మక్కువ తేటతెల్లమవుతుందని ఉపాధ్యాయ సంఘాలు కలెక్టర్ ను కొనియాడారు
పూల బొకేలు శాలువాలతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకృష్ణ మెదక్ జిల్లా టీచర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.