Reporter -Silver Rajesh Medak.
తేదీ 21-6-2024
మెదక్ జిల్లా
ఖర్జూరపంట-లాభాలు ఇంట
మెదక్ జిల్లా రామాయంపేట ఆదర్శ రైతు అన్నె సత్యనారాయణ సాగు
సేంద్రియ, జీవమృత పద్ధతుల్లో
సాగు
ఖర్జూరం ఎంతో రుచి మార్కెట్ లో మంచి డిమాండ్
ఇతర దేశాలనుంచి మొక్కల దిగుమతి
వినూత్న ఆలోచనతో వ్యవసాయం లో నూతన ఉత్తేజం
పెట్టుబడి పోను ఎకరానికి 10 లక్షలు లాభం
ఒక్కసారి ఖర్జూరం మొక్కలు నాటితే 80 సం: లు కాపు కాస్తాయి
మెదక్ జిల్లా రామాయంపేట లో అన్నె సత్యనారాయణ అనే ఆదర్శ రైతు తనకున్న 14 ఎకరాల్లో, 13 ఎకరాల్లో ఖర్జూరం పంటను సాగు చేశారు. ఖర్జూరం పంట మొక్కలను ఇంగ్లాండ్ ,ఇరాన్, ఇరాక్ దేశాల నుంచి తీసుకొచ్చారు. తెలంగాణలో ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా “బరిహి” అనే రకం మొక్కలు అనుకూలంగా పెరుగుతాయని తీసుకొచ్చి సాగు చేశారు.
13 ఎకరాల్లో ఖర్జూరం పంట కోసం దాదాపు పది కోట్ల వరకు పెట్టుబడిగా పెట్టారు. ఈ రకం మొక్కలు ఒక్కసారి నాటితే దాదాపు 80 సంవత్సరాల వరకు కాపు కాస్తాయని, ఈ ఖర్జూరం పంటను సేంద్రియ, జీవమృత పద్ధతుల్లో నాటడం వల్ల ఖర్జూరం ఎంతో రుచిగా ఉందని, మార్కెట్లో కూడా ఈ రకం ఖర్జూరం పంటకు చాలా డిమాండ్ ఉందన్నారు.
ఈ ఖర్జూరం పంటకు ఎలాంటి రసాయనాలు మందులు లేకుండా పండించామని, ఈ ఖర్జూరం పంట వల్ల ఎకరానికి పెట్టుబడి పోను 10 లక్షల వరకు లాభం ఉంటుందని , ఈ పంటను ఈరోజు క్షేత్ర పర్యటన కోసం రాష్ట్రం నుండి దాదాపు 50 మంది రైతులు వచ్చారని ఈ పంట విధానాన్ని పరిశీలించారని అలాగే డెమో కూడా చూపించడం జరిగిందని, జనగామ జిల్లా రఘునాధపల్లి నుండి ఒక రైతు 5 ఎకరాల్లో సాగు చేస్తున్నాడని అతనికి కూడా అలాగే లాభాలు కలిసొస్తాయని అతడు కూడా ఈరోజు వచ్చాడని రైతు సత్యనారాయణ తెలిపారు. ఇలాంటి వినూత్న పంటలతో ఆదర్శంగా నిలుస్తున్న రైతును అధికారులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ శంబాజీ, డాక్టర్ శ్రీకాంత్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి నర్సయ్య, రాజ్ ,నారాయణ, రచన, సంతోష్ ,రామకృష్ణ రైతులు అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.