వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి…
చేవెళ్ల తాజా మాజీ సర్పంచ్ బండారి శైలజాఆగిరెడ్డి
వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చేవెళ్ల తాజామాజీ సర్పంచ్ బండారు శైలజాఆగిరెడ్డి అన్నారు. ప్రస్తుతం వాతావరణంలో వచ్చిన మార్పులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని, అందువల్ల అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షాకాలంలో ఇళ్ల ముందు వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని తెలిపారు. వర్షపు నీరు నిలువ ఉండడం వల్ల దోమలు స్వైరవిహారం చేస్తాయని, దోమలు ద్వారా మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, బోదకాలు తదితర వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. జ్వరంలాంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించాలని తెలిపారు. విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి పాఠశాలలు పున:ప్రారంభం కావడంతో పిల్లలు స్కూల్ బస్సు ఎక్కెడప్పుపు తల్లిదండ్రులు దగ్గర ఉండి బస్సు ఎక్కించాలన్నారు. హాస్టల్లో ఉండే విద్యార్థులు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు ఉండాలని, అధికారులు హాస్టల్లో తనిఖీలు చేయాలన్నారు.