Reporter -Silver Rajesh Medak.
తేది – 14.06.2024.
పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి.. జిల్లా ఎస్.పి డా.బి.బాలస్వామి ఐ.పి.ఎస్.
ఈ రోజు మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి డా. శ్రీ.బి.బాలస్వామి ఐ.పి.ఎస్.గారు రాబోయే బక్రీద్ పండుగ నేపథ్యంలో మాట్లాడుతూ…. పండుగలను ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. మత విద్యేషాలను రెచ్చగొట్టే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కుల మతాలకతీతంగా ప్రతి ఒక్కరూ సోదరుభావంతో పండుగలను జరుపుకోవాలని సూచించారు. మత విద్వేషాలకు సంబంధించి ఎక్కడైనా గొడవలు జరిగితే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అక్రమ పశువుల రవాణా నివారణకు జిల్లాలో 3 చెక్పోస్ట్ లను ఏర్పాటు చేసినామని, పశువుల రవాణా చేసే వ్యక్తులు పశువుల ట్రాన్స్పోర్ట్ కు సంబందించిన అన్ని రకాల నియమ నిబంధనలు పాటించాలని, బక్రీద్ పండుగ సందర్భంగా ఆవులు, లేత దూడల రవాణా చేయవద్దు అని, రవాణా చేయు పశువులకు ఫిట్ ఫర్ ట్రాన్స్పోర్ట్ సర్టిఫికెట్ ఖచ్చితంగా కల్గి ఉండాలని, జంతువులను రవాణా చేసే వ్యాపారులు పరిమితిని మించి జంతువులను ఒకే వాహనం లో తరలించవద్దు అని, జంతువుకు జంతువుకు దూరం ఖచ్చితంగా పాటించాలని, పోలీస్ సిబ్బంది కూడా ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా అన్ని వాహనాలు తనిఖీలు చేయాలని అన్నారు.