అగ్నిప్రమాద బాధితురాలికి అభయం చిరు సాయం
కాపల నారాయణ రావు మాస్టర్ ఉదారత.!
స్టూడియో 10టీవీ ప్రతినిది టెక్కలి - శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో అభాగ్యులకు అండగా నిలుస్తున్న అభయం యువజన సేవా సంఘం వారు నేడు సారవకోట మండలం సొర్లిగాం గ్రామంలో ఇటీవల అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో మెట్ట కస్తూరి అనే ఒంటరి మహిళ వుందని ఆ గ్రామస్థుడు బగాది సునీల్ ద్వారా తెలుసుకొని, ఆమెకు నెలరోజులకు సరిపడేలా 25 కేజీల బియ్యం, 20 రకాల నిత్యవసర వస్తువులు, స్టీల్ సామగ్రి, దుప్పటి, కొన్ని వస్త్రాలతో పాటు గుడిసె నిర్మాణం కొరకు 3000 రూపాయలు ఆర్థిక సాయం అందించినట్లు అభయం యువజన సేవా సంఘం అధ్యక్షుడు దేవాది శ్రీనివాస రావు తెలియజేశారు. ఈ మూడు వేలు ఆర్థిక సహాయం అందించిన కాపల నారాయణరావు మాస్టర్ ని అభయం సేవా సంఘం సభ్యులు అభినందించారు. ఈ సందర్భం గా భవిష్యత్ లో ఎప్పుడైనా తినడానికి ఇబ్బందిగా వుంటే మా అభయం సేవా సంఘం ని సంప్రదించమని ఆమెకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అభయం యువజన సేవా సంఘం అధ్యక్షుడు దేవాది శ్రీనివాస రావు తో పాటు సంఘ సభ్యులు యన్ సింహాచలం, ధర్మవరపు పూర్ణాచారి, మున్నా, అద్దాల వీరబద్రాచారి, ఉంగరాల గోవింద్, దున్న శ్రీనివాస్ పాల్గొన్నారు