*పట్టించుకోని సూపర్వైజర్,
నార్సింగి: నార్సింగ్ మండలంలోని సంకాపూర్ అంగన్వాడి కేంద్రం -1, టీచరు సమయపాలన పాటించటం లేదు అని విమర్శలు వచ్చాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీచర్ ఉండాల్సి ఉండగా వారు సమయానికి రాకుండా ఇష్టానుసారంగా వస్తున్నట్లు విమర్శలు వినిపించాయి. దీని విషయమై మంగళవారం రోజున మన తెలంగాణ రిపోర్టర్ ఉదయం సుమారు 9:30 ప్రాంతంలో వెళ్లి చూస్తే పిల్లలు వచ్చి కూర్చున్నాక కూడా టీచర్ రాక అంగన్వాడి కేంద్రంలో పనిచేస్తున్న ఆయా అన్ని చూసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ అంగన్వాడి సెంటర్ గత ఏప్రిల్ నెలలో కూడా ఈ టీచర్ సమయపాలన పాటించకుండా, సమయానికి స్కూలు తీయకుండా తాళం వేసి ఉన్నది అని ఈ సెంటర్ పై పలుమార్లు అధికారులకు తెలియజేసిన ఎటువంటి స్పందన కూడా లేదు. ఈ విషయమై సంకాపూర్ -1 అంగన్వాడి టీచర్ ని వివరణ అడగగా ప్రతి మంగళవారం నేను లేటు వస్తానని సూపర్వైజర్ తో చెప్పానని పొంతన లేని సమాధానం చెబుతుంది. మొదటగా తప్పు చేసినప్పుడే అధికారులు స్పందించి ఈ అంగన్వాడి కేంద్రంపై చర్య తీసుకుని ఉంటే మళ్లీ ఇలా తప్పు చేయడానికి వీలు ఉండేది కాదు.ఈ మండలంలో అంగన్వాడి కేంద్రాలను నిరంతరం పర్యవేక్షిస్తూ సమయపాలన సక్రమంగా అమలు చేసే బాధ్యత సూపర్వైజరుదే, ఆయా కేంద్రాల ద్వారా గర్భిణీలకు ఆ ప్రాంత ఐదేళ్లలోపు చిన్నారులతో పాటు బాలింతలకు పోషకాహారంతో పాటు పలు విషయాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత టీచర్లదే, వీరు ఈ పనులను సక్రమంగా నిర్వహిస్తున్నారా! లేదా? అనే అంశాన్ని పరిశీలించి ఉన్నత అధికారులకు నివేదికలు అందించాలి అయితే సూపర్వైజర్ మాత్రం అలాంటి పరిస్థితిలను చేసినట్లు ఈ కేంద్రాన్ని చూస్తే కనిపించడం లేదు.గత నెలలో ఈ టీచర్ పై వచ్చిన ఆరోపణల మీద చర్య తీసుకుని ఉంటే ఇప్పుడు ఇలా చేసి ఉండేది కాదు కదా? మొత్తంగా సూపర్వైజర్ నిర్లక్ష్యంతో టీచరు సమయపాలన పాటించటం లేదని, ఈ విషయమై పలుమార్లు సూపర్వైజర్ కి కాల్ చేసిన, వాట్సాప్ చేసిన ఎటువంటి స్పందన ఇవ్వడం లేదు.దీనిని బట్టి చూస్తే టీచర్లకు మద్దతుగా సూపర్వైజర్ ఉంటుందని అర్థం అవుతుంది. ఇప్పటికైనా పై అధికారులు వెంటనే స్పందించి వీరిపై తగు చర్యలు తీసుకోవాలని కోరుచున్నారు.