Reporter -Silver Rajesh Medak.తేది – 03.06.2024.
ఈ రోజు మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి డా.బి.బాలస్వామి ఐ.పి.ఎస్. ఆద్వర్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేయడమైనది. ఈ కార్యక్రమంలో చిన్నశంకరంపేట మండలం గజగట్లపల్లి గ్రామానికి చెందిన ముండ్రాతి సత్యనారాయణకు గజగట్ల గ్రామ పరిది సర్వే నెంబర్ 1146/3I లో 20 గుంటల భూమి ఉన్నదని అట్టి భూమిలోకి మా గ్రామానికే చెందిన కొందరు వ్యక్తులు రానియడం లేదని ఇదెంటని వారిని అడిగితే భూమి లోకి వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని కావున నన్ను నా భూమిలోకి రానీయకుండా బెదిరిస్తున్న వారిపై చట్టపరమైన చర్య తీసుకుని తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని చిన్న శంకరంపేట ఎస్.ఐ కి సూచనలు చేయటం జరిగింది. అలాగే టేక్మాల్ మండలానికి సంగ్య తాండ వెంకటాపూర్ చెందిన కేతావత్ వసంత్ కుమార్ తేదీ:24.02.2024 తన తమ్ముడు కరెంట్ షాక్ తో చనిపోయాడని తన తమ్ముడి మరణానికి కారణం అయిన వారిపై చర్యలు తీసుకుని తమకు నష్టపరిహారం ఇప్పియాలని ఫిర్యాదు చేయగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని అల్లాదుర్గ్ సిఐకి సూచనలు చేయటం జరిగింది.