Reporter -Silver Rajesh Medak.
తేది 31 మే 2024.
మెదక్ జిల్లా
పదవి విరమణ సర్వసాధారణం
వృత్తిగా కాకుండా సేవా భావంతో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు రమేష్ ప్రజలకు ఎనలేని సేవలు అందించారని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కొనియాడారు
అదనపు కలెక్టర్ రమేష్ పదవి విరమణ వీడ్కోలు సన్మాన కార్యక్రమంలో
—జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఉద్యోగ విరమణ అనేది తప్పనిసరి అని కానీ తాను చేస్తున్న ఉద్యోగానికే కానీ జీవితానికి కాదని, ప్రతి ఒక్క ఉద్యోగి ఉద్యోగంలో చేరినప్పుడే రిటైర్మెంట్ అనేది తప్పదని ఉద్యోగం చేసినన్ని రోజులు తన విధులు సక్రమంగా నిర్వహించి ప్రజల చేత ,అధికారుల మన్ననలు పొందినప్పుడే తను చేసిన ఉద్యోగానికి సార్ధకత లభిస్తుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.
మెదక్ పట్టణం లోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో శనివారం మే 31 నాడు ఉద్యోగ పదవీ విరమణ పొందుతున్న జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ సన్మాన ఉత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అదనపు కలెక్టర్ రమేష్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ టైపీస్ట్ గా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించి, ఉన్నత శిఖరాలను అధిరోహించిన గొప్ప వ్యక్తి అన్నారు.
జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ మాట్లాడుతూ ఉద్యోగ జీవితంలో సహకరించిన ఉద్యోగులు సంఘాలు రాజకీయ నాయకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ బాలస్వామి అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అదనపు ఎస్సీ మహేందర్ జిల్లా అధికారులు ఉద్యోగ సంఘాల నాయకులు రాజకీయ సంఘాల నాయకులు ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు.