రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) మే 31:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం సుతారిపల్లి గ్రామంలో మండల తహసిల్దారు రజినీకుమారి ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవం గ్రామ పంచాయతీ వద్ద ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తహసిల్దార్ రజనీకుమారి మాట్లాడుతూ… ప్రతి ఒక్క మనిషి రాజ్యాంగపరంగా జీవించే హక్కు ఉందని ఇతరుల స్వేచ్ఛను భంగం కలిగించకుండా ఉన్నంత వరకు మీ స్వేచ్ఛను ఉపయోగించుకోవచ్చని ఆమె తెలిపారు. భారత రాజ్యాంగంలో మీకు పొందుపరిచిన రిజర్వేషన్లు ప్రత్యేకంగా కేటాయించిన పథకాలు పొందడం కూడా మీ హక్కుగా భావించాలని ఆమె పేర్కొన్నారు. గతంలో ఉన్నటువంటి రెండు గ్లాసుల పద్ధతిని గ్రామాలలో రూపుమాపడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రజలకు అవగాహన కల్పించారు. అదేవిధంగా గ్రామాల్లో జరుగుతున్న బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు అడ్డుకట్ట వేయాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు యువకులు గ్రామ నాయకులు గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.