-ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి
స్టూడియో 10 టీవీ న్యూస్, మే30, మహానంది:
మహానంది పుణ్యక్షేత్రంలో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ లెక్కింపు నిర్వహించగా దేవస్థానానికి రూ.66,46,755 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.గురువారం ప్రధాన ఆలయాల్లో భక్తులు 65 రోజులపాటు సమర్పించిన హుండీ కానుకలను ఆలయ ప్రాంగణంలోని అభిషేక మండపంలో సిబ్బందితో లెక్కించామన్నారు. ఇందులో స్వామి, అమ్మవారి ఆలయాలలోని హుండీలతో పాటు ఇతర హుండీలను లెక్కింపు నిర్వహించగా రూ.66,46,755 లక్షలు వచ్చిందన్నారు. ఆలయాల ద్వారా రూ.65,46,755 అన్న ప్రసాదం హుండీ ద్వారా రూ. 94,915 గోసంరక్షణ ద్వారా రూ.35,644 వేలు, అలాగే యూఎస్ఏ 10 ధీరం, 1,యూఎస్ఏ 10 డాలర్, 1, యూఎస్ఏ 1 డాలర్ ,2 ,నేపాల్ 10 ,1 ,నేపాల్ 50 , 1,వచ్చినట్లు ఈవో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖా తరుపున వెలుగోడు గ్రూప్ దేవాలయము ల ఈవో వి. జనార్ధన్, మహానంది దేవస్థానం ఏఈవోలు వై .మధు, ఓ. వెంకటేశ్వరుడు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు రాజు ,శశిధర్ రెడ్డి, ఆలయ అర్చకులు, సిబ్బంది, ఏజెన్సీ వర్కర్స్, భ్రమరాంబిక సేవా సమితి సేవకులు, శ్రీ కృష్ణ దత్త సాయి సేవా సమితి సేవకులు, తదితరులు పాల్గొన్నారు.