రామాయంపేట (స్టూడియో10 టీవీ వి ప్రతినిధి) మే 30:- మెదక్ జిల్లా రామాయంపేట సర్కిల్ కార్యాలయం నందు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటేష్ ఆధ్వర్యంలో మండల వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి రామాయంపేట మండల వ్యాప్తంగా విత్తన వ్యాపారం చేస్తున్నటువంటి డీలర్లకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సీఐ. వెంకటేష్ మాట్లాడుతూ విత్తన నియంత్రణ చట్టం 1983 లోబడి అందరూ విత్తన వ్యాపారం చేయాలని ప్రతి విత్తన డీలరు లైసెన్సు కలిగి ఉండాలని అన్నారు. అదేవిధంగా లైసెన్స్ యొక్క గడువు తేదీని సరిచూసుకోవాలని మరియు అధికృత విత్తన కంపెనీల నుండి మాత్రమే విత్తనాలు తేవాలని విత్తనాలు తెచ్చేటప్పుడు తప్పనిసరిగా ఇన్వాయిస్ మరియు ప్రిన్సిపల్ సర్టిఫికేట్ కలిగి ఉండాలని తెలిపారు.విత్తనాలు అమ్మేటప్పుడు ప్రతి రైతుకు బిల్లులు తప్పనిసరిగా ఇవ్వాలని ప్రతి బిల్లు పైన రైతు యొక్క సంతకాలను తీసుకోవాలని పోలీసు మరియు వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించినప్పుడు సహకరించి రికార్డులను చూపించాలని పేర్కొన్నారు.కల్తీ విత్తనాలు అమ్మినట్టయితే డీలర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీలర్లకు సూచించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజ్ నారాయణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రంజిత్ కుమార్ మరియు ఇతర అధికారులు ఫర్టిలైజర్ షాపుల డీలర్లు పాల్గొన్నారు.