-ఎస్ఐ నాగేంద్రప్రసాద్
స్టూడియో 10 టీవీ న్యూస్,మే30, మహానంది:
నేరాల నియంత్రణకు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు మహానంది ఎస్ఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు. గురువారం మహానంది మండలం గాజులపల్లె గ్రామ పరిధిలోని బుచ్చమ్మ తోపు యందు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా, ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ముందస్తు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో యువత నాటు సారా, మద్యం, గుట్కా వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు అతి వేగంగా, అజాగ్రత్తగా నడపవద్దని కోరారు. వీటితో కలిగే ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని, డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుందన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, ఒకవేళ ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గ్రామాల్లోకి అనుమానిత వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐలు రామకృష్ణ, బాలచంద్రుడు, హెడ్ కానిస్టేబుళ్లు ప్రసాద్ , రామ్మోహన్, ఓబులేష్, కానిస్టేబుళ్లు శేఖర్, శేషు తదితరులు పాల్గొన్నారు.