Reporter -Silver Rajesh Medak.
మెదక్ ,మే,30, 2024
కొనుగోలు చేసిన ధాన్యానికి మద్దతు ధర రైతుల బ్యాంకు అకౌంట్లో జమ చేసే విధంగా చర్యలు జిల్లా కలెక్టర్
గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 70,000 క్వింటాళ్ల ధాన్యం అదనంగా కొనుగోలు చేయడం జరిగింది.
ఇప్పటివరకు 2, లక్షల 60, వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
రైతులు ఎవరు అధైర్యపడవద్దు జిల్లా పాలనయంత్రాంగం అండగా ఉంది
కొనుగోలు పూర్తి చేసుకున్న 300 సెంటర్స్ మూసివేత
వాతావరణ అనుకూల ప్రభావంతో
దాన్యం కొనుగోలు ముగింపు దశలో ఉన్నది.
నాణ్యత గల ధాన్యాన్ని మిల్లులకు ఎగుమతి చేసి రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా చర్యలు
ఇంకా సుమారు పదివేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉంది కలెక్టర్
క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
గురువారం కౌడిపల్లి మండలం
వెల్మ కన్య గ్రామంలో నీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
వాతావరణ సమతుల్యతతో కొనుగోలు ప్రక్రియ ప్రశాంతంగా నడుస్తూ ముగింపు దశకు వచ్చిందని
సంతోషింతు తగ్గ విషయమని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే ఎగుమతి చేయించి సకాలంలో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసే విధంగా పగడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 02 లక్షల 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు 300 సెంటర్స్ మూసి వేయడం జరిగిందని, ఇంకా 100 సెంటర్స్లో కొనుగోలు ప్రక్రియ నడుస్తుందని రాబోవు నాలుగు రోజుల్లో కొనుగోలు పూర్తిచేసుకుని
ఆ కేంద్రాలు కూడా ముగింపు దశకు చేరుకుంటాయని వివరించారు
ఇంకా మిగిలి ఉన్న 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వేగవంతంగా పూర్తి చేసే విధంగా పగడ్బందీగా చర్యలు తీసుకున్నామన్నారు మంచి నాణ్యత గల బియ్యాన్ని వేరే జిల్లాలకు పంపిస్తున్నామని కలెక్టర్ వివరించారు
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు కొనుగోలు కేంద్రాల నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.