రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) మే 29:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఈనెల 17వ తేదీన సాయి కృష్ణ హాస్పిటల్ లో గర్భిణీ స్త్రీ డాక్టర్ కృష్ణవేణి చికిత్స చేసినా అనంతరం మృతి చెందడంతో మృతురాలు బంధువులు డాక్టర్ నిర్లక్ష్యంతో సరైన చికిత్స చేయకపోవడం వల్లన మరణించిందని ఆరోపించారు. బుధవారం రోజు రామాయంపేట సాయి కృష్ణ హాస్పిటల్ ముందు సుమారు 15 మంది వరకు బంధువులు ధర్నాకు దిగారు.అంతే కాకుండా సాయి కృష్ణ హాస్పిటల్ డాక్టర్ కృష్ణవేణి డౌన్ డౌన్ అంటూ వెంటనే హాస్పిటల్ అనుమతులు రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.అదే విదంగా మృతురాలి తల్లి మాట్లాడుతూ తన బిడ్డ ఎస్తేరును ప్రతినెల గర్భవతి ఆయిన ఆమెను ఈ ఆస్పత్రిలోని చూయిస్తూ ప్రసవానికి వచ్చిన రోజు సరైన చికిత్స అందించకుండా ఆపరేషన్ చేయడమే కాకుండా తల్లి పిల్ల కూడా మరణించడానికి డాక్టర్ కృష్ణవేణి కారణమని ఆమె కన్నీరు మున్నీరుగా విలేకరులతో తెలిపారు.ఈ విషయంలో డాక్టర్ కృష్ణవేణితో బంధువులు మృతురాలు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున వాగ్వాదానికి దిగారు.కాని డాక్టర్ తాను ఎలాంటి పొరపాటు చేయలేదని అది లోపల ఉన్న లోపమే కారణం అని కొట్టిపారేశారు.బంధువులు ఆవేశంతో తాము బయటకి పోస్ట్మార్టం నిర్వహించి పోలీస్ స్టేషన్ లో తెలియచేయడమే కాకుండా జిల్లా వైద్యాధికారి వద్దకు కూడా వెళ్తున్నట్లు వారు విలేకరులతో తెలుపుతూ పోలీస్ స్టేషన్ వెళ్లడం జరిగింది.సాయి కృష్ణ హాస్పిటల్ లో జరిగిన ఈ సంఘటనపై జిల్లా వైద్యాధికారి ఆధ్వర్యంలో డాక్టర్ల బృందం దర్యాప్తు చేసినట్లు సమాచారం.ఈ విషయమై మెదక్ జిల్లా డిఎంహెచ్వో కార్యాలయానికి ఫోన్ చేసి వివరణ కోరగా దర్యాప్తు చేయడం జరిగిందని దానిపై పూర్తి వివరణ రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.