/నార్సింగి: గర్భిణీ స్త్రీలు , గర్భిణీ స్త్రీలు పిల్లలు పోషకాహార లోపంతో ఉండకూడదు అనే ఉద్దేశంతో ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాలలో పౌష్టికాహారం అందిస్తుంది . కానీ నార్సింగి మండల కేంద్రంలోని ఆరవ అంగన్వాడి కేంద్రంలో గత నాలుగు రోజుల నుండి గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు, మంచి పోషకాలు అందించేటువంటి గుడ్డు మాత్రం అందించడం లేదు, వేసవి సెలవులు కాబట్టి 15 రోజులు అంగన్వాడి టీచర్ ,15 రోజులు ఆయా విధులు నిర్వహిస్తుంటారు ఆయా విధులు నిర్వహిస్తున్న 15 రోజులలో అంగన్వాడి కేంద్రంలో టీచరు రోజువారి గర్భిణీల సంతకాల రిజిస్టర్ ,అటెండెన్స్ రిజిస్టర్, సరుకులు ఆయకు ఇచ్చి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఆయా అటెండెన్స్ రిజిస్టర్ ఒకటి ,కొన్ని సరుకులు మాత్రమే ఇచ్చి మిగిలిన సరుకులు ఒక గదిలో వేసి తాళం వేశారు,తాళం వేసిన అంగన్వాడి టీచర్ తాళం చెయ్ తన వెంట తీసుకుపోయారు. సుమారు 14 రోజులుగా గర్భిణీలు భోజనం చేస్తూ, రిజిస్టర్ లేక సంతకం చేయకుండా వెళుతున్నామని, నాలుగు రోజులుగా గర్భిణీలకు, పిల్లలకు కోడిగుడ్డు ఇవ్వటం లేదని వారు వాపోయారు. గర్భిణీల సంతకాల రిజిస్టర్, గుడ్లు లేవని ఆయా, టీచర్ కి చెప్పిన ఇప్పటివరకు ఆ టీచరు లో ఎలాంటి స్పందన లేదు అని స్పష్టంగా తెలుస్తుంది.గర్భిణీలు గత 14 రోజులుగా భోజనం చేస్తున్న రిజిస్టర్ లేక సంతకం చేయకుండా వెళుతున్నారు. అయితే ఇక్కడ ఈ 14 రోజుల్లో ఎంతమంది వచ్చారు ఎంతమంది తిని వెళ్లారు అన్నది ఎలా తెలుస్తుంది. వచ్చిన వారి సంతకాలు ఎవరు పెడతారు. అంటే దీనిని బట్టి చూస్తే అంగన్వాడీ కేంద్రంలో సుమారు 14 మంది గర్భిణీలు ఉంటే ఒక రోజుకు వచ్చి పదిమంది తింటే 14 మంది తిన్నారు అని రాసుకోవడానికి ఇలా చేస్తున్నారా? నలుగురి గర్భిణీల యొక్క పౌష్టిక ఆహారం పక్కదారి పట్టడానికి ఇలా ఆ టీచర్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అంతేకాకుండా ఈనెల 27వ తేదీన అంగన్వాడి సూపర్వైజర్ సుజాత కేంద్రాన్ని తనిఖీ చేసిన ఇప్పటివరకు మాత్రం గుడ్లు, గర్భిణీల సంతకాల రిజిస్టర్ గురించి అడిగిన దాఖలాలు ఉన్నట్టు కనిపించలేదు , అంటే అంగన్వాడి టీచర్,అంగన్వాడి సూపర్వైజర్ ఒకటి అయ్యి గర్భిణీలకు అందించాల్సిన పౌష్టిక ఆహారాన్ని పక్కదారి పట్టిస్తున్నట్లు ఈ కేంద్రాన్ని సందర్శిస్తే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. పై అధికారులు వెంటనే స్పందించి ఆరవ అంగన్వాడి కేంద్రం పై చర్యలు తీసుకొని గుడ్డు అందించే విధంగా చూడాలని గర్భిణీ స్త్రీలు, పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.
డి డబ్ల్యు ఓ వివరణ కోరగా(బ్రహ్మాజీ)
జిల్లాలోని అన్ని అంగన్వాడి కేంద్రాలలో పోషకాలతో కూడినటువంటి అన్ని ఉన్నాయని తెలిపారు. నార్సింగ్ మండల కేంద్రంలో ఆరవ అంగన్వాడి కేంద్రంలో ఎందుకు లేవు అనే విషయాన్ని కిందిస్థాయి అధికారులను తెలుసుకుంటానని తాను తెలపడం జరిగింది.