Reporter -Silver Rajesh Medak.
మెదక్,29, 2024( బుధవారం)
బడిబాట కార్యక్రమానికి సన్నద్ధం కావాలి
అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
పాఠశాలలు తెరిచే నాటికి యూనిఫామ్ సిద్ధం చేయాలి
నాణ్యమైన గుణాత్మక . విద్య ప్రతి విద్యార్థికి అందించడమే లక్ష్యం
- పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ జిల్లాలకు సరఫరా అయిన స్థితి*
హైదరాబాదు నుండి విద్యాశాఖ విధివిధానాలపై జిల్లా కలెక్టర్లతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహణ
విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బుర్ర వెంకటేష్ గౌడ్
బుధవారం విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలోని జిల్లా కలెక్టర్లతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ విద్యా సంవత్సరంలో విద్యా ప్రమాణాలు అమలు, అమ్మ ఆదర్శ పాఠశాలల మరమ్మతుల పనుల పురోగతి, పాఠశాల తెరిసేలోపు విద్యార్థులకు నాణ్యమైన ఏకరూప దుస్తులు తయారు చేసి అందివ్వటం,
బడిబాట కార్యక్రమం నిర్వహణ, సంబంధిత విషయాలపై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం గౌడ్ పలు జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు సలహాలు అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన గుణాత్మక విద్యను అందించాలని లక్ష్యంతో అధికారులు సంసిద్ధంగా ఉండాలని ప్రతి విద్యార్థి పాఠశాలల్లో ఉండాలి, వారికి విద్య అందాలి, అనే దృఢ సంకల్పంతో అంకుటిత దీక్షతో పనిచేయాలని చెప్పారు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, సరఫరా విధానాన్ని విద్యాశాఖ అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఏకరూప దుస్తులు త్వరితగతిన మహిళా సంఘాల ద్వారా కుట్టించి
నిర్దేశిత గడువు తేదీలోగా సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల మరమ్మత్తుల పనులు జిల్లాల వారీగా పురోగతిని అడిగి తెలుసుకున్నారు.
బడిబాట కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించడానికి
మూడు కేటగిరీలు వారీగా విద్యార్థిని విద్యార్థులను గుర్తించాలని బడులు తెరిచే సమయానికి అంతా సిద్ధం చేసుకోవాలని పలు సూచన చేశారు
విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఏర్పాటు చేసిన సెల్ కాన్ఫరెన్స్లో
మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకరూపు దుస్తుల విషయంలో జిల్లాకు ఇచ్చిన 78,000 లక్ష్యంగా మహిళ స్వశక్తి సంఘాల 900 టైలర్స్ కుట్టు పని నడుస్తుందాన్నారు. మహిళా సంఘాలు 900 మంది దర్జీలను ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు 9000 యూనిఫార్మ్స్ కుట్టే విధంగా చర్యలు చేపట్టాలని సమయం దగ్గర పడుతున్నందున త్వరితగతిన యూనిఫార్మ్స్ అందివ్వాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిని కలెక్టర్ ఆదేశించారు. త్వరలో లక్ష్యాన్ని పూర్తి ఛేదించాలన్నారు
అమ్మ ఆదర్శ పాఠశాలల పురోగతి పనులను క్షేత్రస్థాయిలో జిల్లా పాలన యంత్రాంగం సందర్శించి పూర్తయ్యేలా చర్యలు చేపట్టామని పంచాయతీ సెక్రటరీలు మండల విద్యాశాఖ అధికారుల సమన్వయ సమావేశం ఈనెల 31వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఆ సమావేశంలో ఈ విద్యా సంవత్సరం చేపట్టబోయే విధివిధానాలపై చర్చించి బడిబాట కార్యక్రమం నిర్వహణపై పలు సూచనలు సలహాలు అందించడం జరుగుతుందని చెప్పారు. విద్యా విధానాలను ప్రతిరోజు చేపట్టబోయే కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్ లో పొందుపరచాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకృష్ణ
సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు