స్పందించిన ప్రజా ప్రతినిది
చేయుతందించిన చందాయిపేట తాజామాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్
పెద్దశివనూర్, చందాయిపేట, చెగుంట, మే, 29. ప్రతినిధి.
దేవుడున్నాడో లేడో తెల్వదు. కానీ కన్పించే దైవం మరీ తలుపు తట్టి నేనున్నా అని ఓ అభాగ్య కుటుంబానికి బాసటగా నిలిచిన సంఘటనలు కోకొల్లలు…అందులో ఈ ఒక్కటి… మీ ముందుంచుతున్నాను. మెదక్ జిల్లా చెగుంట మండలం పెద్ద శివునూర్ గ్రామానికి చెందిన తలారి వెంకటేష్ ఇటీవల పేరాల్సిస్ సోకి మంచాన పడి లేవలేకుండా ఉన్నాడు.ఈ విషయం తెల్సుకున్న చందాయిపేట్ తాజామాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్,మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్ తన ఉదారత చాటారు. తలారి వెంకటేష్ కుటుంబానికి అండగా నిలిచి తినడానికి బియ్యం, కిరాణా సామాను, ఆర్థిక సహాయం అందజేసి మానవీయ కోణంలో ఉదారత చాటారు. గత ఐదు ఆరు ఏళ్ల నుంచి చందాయిపేట తాజా మాజీ సర్పంచ్ సర్పంచ్ బుడ్డా స్వర్ణలత భాగ్యరాజ్ తన ఉదారతం చాటుతూ నిరుపేద అమ్మాయిల వివాహానికి పుస్తే మట్టేలు, పెళ్లి చీర బట్టలు, బియ్యము అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా నిరుపేద ఇళ్లలో ఎవరైనా మరణిస్తే దశదినకర్మకు ఆర్థిక సాయంతో పాటు తినడానికి బియ్యం అందజేసి వారి యొక్క మంచితనాన్ని చాతుతున్నారు. ఇంత చేస్తున్న బుడ్డ స్వర్ణలతభాగ్యరాజ్ కుటుంబాన్ని పరిసర గ్రామాల ప్రజలు నిండు మనస్సు తో సర్పంచ్ దంపతులను నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని ప్రజలు దీవిస్తున్నారు. వారికి ప్రజల దీవెనే శ్రీరామరక్షగా నిలిచింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అన్నం ఆంజనేయులు, ఆకుల కుమార్, తలారి అశోక్, బోల్లేబోయిన మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.