సోమ్ డిస్టిలరీస్ కంపెనీ రాష్ట్రంలోకి అడుగు పెడుతోంది. సరికొత్త మద్యం బ్రాండ్లను అందుబా టులోకి తీసుకురానుంది. సాధారణంగా వినిపించే కింగ్ ఫిషర్, ఆర్సీ లాంటి బీర్లు కాకుండా ఇప్పటి నుంచి పవర్ 10000, హంటర్, బ్లాక్ ఫోర్ట్, వుడ్ పీకర్ లాంటి పేర్లు వినబోతున్నారు మద్యం ప్రియులు. ఆ కంపెనీకి ప్రభుత్వం ఇప్పటికే అనుమ తులు ఇవ్వగా, రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేయడాని కి కావలసిన ఏర్పాట్లు చేసుకుంటోంది. రాష్ట్రంలో బీర్లకు కొరత ఏర్పడటంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం సోమ్ డిస్టలరీస్కు ఓకే చెప్పిన రేవంత్ సర్కార్ మధ్యప్రదేశ్లో ఈ బ్రాండ్పై నిషేధం అక్కడ గతంలో 24 మంది మృతికి కారణం
ఎన్నికల విరాళాల కోసం ప్రాణాలతో చెలగాటమా రేవంత్ సర్కార్ మరో కొత్త వివాదానికి తెరలేపింది. కొత్తరకం మద్యం బ్రాండ్లను రాష్ట్రంలోకి తీసుకొస్తోంది. వివాదాస్పద సోమ్ డిస్టిలరీస్ కంపెనీకి అనుమతులు ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఈ కంపెనీపై మధ్యప్రదేశ్లో బ్యాన్ విధిస్తే, మన రాష్ట్రంలో అమ్మకాలకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీని వెనక భారీ కుంభకోణం ఉందన్న ప్రచారం జరుగుతోంది. కొత్తరకం మద్యాన్ని రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తేవడం పక్కన పెడితే, దాని ద్వారా ఎన్నికల విరాళాలు సమకూర్చుకోవడం కనపడుతోంది.