రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) మే 27:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పంటల విస్తీర్ణం పెరిగే అవకాశం ఉన్నందున వ్యవసాయ సంబంధిత అంశాలపై రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో గ్రామ గ్రామాన రైతులతో సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి రాజ్ నారాయణ మాట్లాడుతూ లక్ష్మాపూర్ గ్రామంలో రైతులకు విత్తన కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వేసవి దిక్కులో వర్షాకాలంలో వివిధ పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సమగ్ర పోషక యాజమాన్యం వంటి అంశాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు.అదేవిధంగా ప్రగతి ధర్మారం దామరచెరువు మరియు కోమటిపల్లి ఝాన్సీలింగాపూర్ గ్రామాలల్లో రైతులకు అవగాహన కల్పించడం జరిగిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు వసంత సుగుణ, వ్యవసాయ విస్తరణ అధికారి స్రవంతి, మండల వ్యవసాయ అధికారి రాజ్ నారాయణ వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.