రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) మే 27:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయలపూర్ గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దాన్యం కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉన్న ధాన్యమును లారీల ద్వారా రైస్ మిల్లులకు వెంటనే చేరవేయాలని అధికారులకు తెలిపారు.ఇప్పటి వరకు జిల్లాలో పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 2 లక్షల 40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి పూర్తి స్థాయిలో రికార్డును సాధించామని ఆయన వెల్లడించారు.రాయాలపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మండల పరిధిలోని దామరచెరువు గ్రామంలో అమ్మ ఆదర్శ పాఠశాల పనులు త్వరలో పూర్తి చేసి జూన్ నెలాఖరి వరకు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట మండలం తహసిల్దార్ రజనీకుమారి, మండల వ్యవసాయ అధికారి రాజ్ నారాయణ,మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.