మహానటులు ఎవరు…
తెలంగాణ పోరాటంలో గత అరవై ఏండ్ల నుండి పోరాటం చేస్తూ వస్తున్న తెలంగాణ ప్రాంత వాసులను మోసం చేసి ప్రో. జయశంకర్, జేఏసీ కోదండరాం, నవ తెలంగాణ పార్టీ విజయశాంతి గార్లను, 1200 మంది విద్యార్థుల చావుకు కారణమై, సకల జనులను మోసం చేసిన కెసిఆర్ మహా నటుడు…
తెలంగాణ ఉద్యమంలో అసలు పాత్ర లేకుండా పరాయి దేశాల్లో పని చేసిన కేటీఆర్ మహా గొప్ప నటుడు…
తెలంగాణ ఉద్యమ సమయంలో పెట్రోలు పోసుకొని అగ్గిపెట్టె దొరకలేదని చెప్పి విద్యార్థులను ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరేపించిన హరీష్ రావు ఇంకా గొప్ప నటుడు…
తెలంగాణ ప్రాంత ప్రజల ఆరాధ్య పండుగ బతుకమ్మ పండుగ, గత కొన్నెండ్ల నుండి చేస్తున్న బతుకమ్మ పండుగ కూడా కవితమ్మ వచ్చాకే తెలంగాణకు బతుకమ్మ పండుగ వచ్చింది అన్నట్లు నటించిన మహా నటీమణి కవితమ్మ…
తెలంగాణ ప్రాంత ప్రజల అభీష్టం మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని తల్లి సోనియమ్మ ఇస్తే అప్పటి టీ.ఆర్.ఎస్. పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్త అని సోనియమ్మ కాళ్ళు మొక్కిన నటకిరీటి కెసిఆర్…
గత పదేండ్ల పాలనలో తెలంగాణ ఉద్యమ కారులకు కనీస గౌరవం ఇవ్వలేని పరిస్థితిలో కెసిఆర్ ఉన్న కానీ ఒక్కసారి కూడా కెసిఆర్ తప్పలను ప్రశ్నించని నువ్వు ఇంకా గొప్ప నటుడివి…
లిక్కర్ స్కాంలో జైలుకు వెళ్లిన మహానటి గురించి ప్రజలకు తెలియజేయకుండా వాళ్ళను ఇంకా భుజంపై మోస్తున్న నువ్వు నటుడివి…
గత పదేండ్ల పాలనలో ములుగు జిల్లా నుండి అక్రమంగా ఇసుకను, ఎర్రమట్టిని, గోదావరి జలాలను తరకించుకుపోయిన కెసిఆర్ ములుగు జిల్లాకు చేసిన అభివృద్ధి ఏంటి అనేది చెప్పకుండా కథలు అల్లుతున్న నువ్వు మహా నటుడివి…
దొరల అహంకారంతో వాళ్ళు తెలంగాణ ఆస్తిని దోచుకుంటే మాట్లాడని నువ్వు నటుడివి…
దొరల మోచేతి నీళ్ళు తాగుతూ ఇంకా దొరల కింద బానిసత్వం చేస్తున్న నువ్వు నటుడివి..
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మంత్రి వర్గ విస్తరణ జరిగేలోపే మేడారం మహకుంభమేళ వస్తె మేడారం జాతరకు వస్తున్న భక్తులు ఇబ్బందులకు గురి కాకుండా తాత్కాలిక మరమ్మత్తులు చేసిన సీతక్క గారిని మహానటి అంటావా, మతి భ్రమిస్తే చికిత్స తీసుకో కానీ నీ ఇష్టానుసారం సీతక్క గారిని అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు…
మేడారం జాతర అయిపోగానే మార్చి 17 న పార్లమెంటు ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది లేకపోతే ప్రతి ఒక్క బ్రిడ్జి పునర్నిర్మాణం జరిగేది అని తెలుసుకో…
నటించాల్సిన అవసరం మా సీతక్క గారికి ఏముంది.. నువ్వు ఇంకా దొరల కింద బానిసలా బ్రతుకుతూ నటిస్తున్నావని ప్రజలందరికీ తెలుసు…
అసలు మా ములుగు నియోజకవర్గానికి కెసిఆర్ చేసిన అభివృద్ధి ఏంటి అనేది చెప్పు…
ములుగును సమ్మక్క – సారలమ్మ జిల్లాగా ప్రకటిస్త అని 2014 ఎన్నికల ముందు హామీ ఇచ్చి మోసం చేస్తే ములుగు జిల్లా సాధన కమిటీ ద్వారా ములుగు జిల్లా కోసం పోరాటం చేసిన ఘనత సీతక్క గారిది…
2018 ఎన్నికల్లో సీతక్క గారు గెలిచాక ములుగు నియోజకవర్గంలో టి.ఆర్.ఎస్.పని అయిపోయింది అని, టి.ఆర్.ఎస్.మళ్ళీ ములుగులో రావాలంటే జిల్లా ఇవ్వాలని తెలిసేలా కెసిఆర్ గారికి తెలిసేలా చేసింది మా ములుగు జిల్లా ప్రజలు…
తెలంగాణ ఉద్యమ పోరాటంలో భాగంగా రైల్ రోకో చేసిన ఘనత సీతక్క గారిది…
టి.ఆర్.ఎస్.పార్టీ అధికారంలోకి వచ్చిన పదేండ్లలో విద్యా వ్యవస్థ కుంటుపడింది, యువత భవిష్యత్తు నిర్వీర్యం అయింది, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులకు గురి అయ్యారు, దళిత ముఖ్యమంత్రి ఏమైంది, దళితులకు మూడు ఎకరాల భూమి ఏమైంది, ఇంటికి ఉద్యోగం ఎటు వెళ్ళింది, టీ.ఎస్.పి.ఎస్.సి. పేపర్ లీకేజీ ఎలా జరిగింది, లిక్కర్ స్కాంలో కవితమ్మ పాత్ర ఏంటి, కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరి కోసం కట్టబడింది, వేల కోట్ల ప్రజాధనం పాలకుల చేతికి ఎలా చిక్కాయి, కేజీ టూ పీజీ ఉచిత నిర్భంద విద్య ఎంతవరకు వచ్చింది, అర్హులైన వారికి రెండు పడక గదుల ఇండ్లు ఎందుకు ఆగిపోయాయి, శ్రీకాంత్ చారి అమ్మకు ఎందుకు నామినేటెడ్ పదవి ఇవ్వలేదు, గద్దర్, కోదండ రామ్ లాంటి వారికి సరైన గౌరవం ఎందుకు లభించలేదు, ప్రతి మండలంలో డిగ్రీ కాలేజ్ ఏమైంది, ప్రతి జిల్లా కేంద్రంలో వంద పడకల వైద్యశాల ఎంతవరకు వచ్చింది, బీసీ బంధు, దళిత బంధు ఎందుకు అందరికీ రాలేదు, పంట రుణాలు ఎందుకు ఆగిపోయాయి, పంట బీమా పథకం ఎందుకు ఆగిపోయింది, తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాల వలన పంటలు, ఇండ్లు కోల్పోయిన వారికి నష్ట పరిహారం ఎందుకు ఇవ్వలేదు, సబ్సిడీ రుణాలు ఏమయ్యాయి, ఎస్.ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం నిధులు ఎటు మల్లించబడ్డాయి, హైదరాబాద్ మున్సిపల్ నిధులు ఎవరి ఖాతాల్లోకి చేరాయి ఇవన్నీ సమస్యలు ఉన్న వీటిని ప్రశ్నించాల్సిన నువ్వు పట్టమని మూడు నెలలు కూడా సరిగ్గా అధికారం చేపట్టని కాంగ్రెస్ పార్టీని, సీతక్క గారిని ప్రశించడం హాస్యాస్పదంగా ఉంది, ముందు వీటన్నిటి గురించి ప్రశ్నించి అప్పుడు మా కాంగ్రెస్ పార్టీని ప్రశించు అంతే కానీ ఒక దొరల పార్టీకి తొత్తుగా మారి వారిచ్చే చిల్లర డబ్బులకు కక్కుర్తి పడి ఏది పడితే అది మాట్లాడితే, ఆదివాసీ సీతక్క గారి గురించి అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదు…
ఇకనైనా నిజ, నిజాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది, లేకపోతే మంత్రి సీతక్క గారిపై అసత్య ప్రచారాలు చేస్తే చట్టరీత్య చర్యలు తీసుకోవాల్సి వస్తుంది…
మీ
పైడాకుల అశోక్
ములుగు జిల్లా అధ్యక్షులు
కాంగ్రెస్ పార్టీ