రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) మే 26:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత రావు ఆదివారం రోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రామాయంపేట బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నాలుగో వార్డు కౌన్సిలర్ గజవాడ నాగరాజు పై పోచమ్మల గణేష్ పెట్రోల్ తో దాడి చేయడం చాలా బాధాకరం అన్నారు. వీరి ఇరువురి మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణలు మాజీ మంత్రి హరీష్ రావు, కాంటారెడ్డి తిరుపతిరెడ్డిలు రాజకీయంగా ఎదుర్కోలేకనే వారి ఇరువురి మధ్య లేనిపోని చిచ్చు పెడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఈ ఘర్షణలకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. నిన్న జరిగిన దాడి సమయంలో కాంగ్రెస్ నాయకుల పైన కూడా పెట్రోల్ పడిందన్నారు. గజవాడ నాగరాజు పెద్దమ్మ గుడి దగ్గరికి రమ్మంటేనే కాంగ్రెస్ నాయకులు అక్కడికి వెళ్లినట్లు తెలిపారు. పోచమ్మల గణేష్ కు నాగరాజుకు మధ్య ఆర్థిక లావేదేవీలే కారణమని దానిని కాంగ్రెస్ పార్టీకి అంటగట్టడం ఎంతవరకు సమంజసమని పేర్కొన్నారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు కాంటారెడ్డి తిరుపతిరెడ్డి కాంగ్రెస్ పార్టీపై లేనిపోని ఆరోపణలు చేయటం సబబు కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అసాంఘిక చర్యలకు ఎప్పుడు పాల్పడదని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి,కౌన్సిలర్ చిలుక గంగాధర్, దోమకొండ యాదగిరి బీసీ సెల్ అధ్యక్షుడు చింతల స్వామి మండల నాయకులు రేవెల్లి వినయ్ సాగర్ చింతల నరేష్ చిలుక విరాట్ జీడిపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.