రామాయంపేట (స్టూడియో 10 టీవీ ప్రతినిధి) మే 26:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్ గ్రామంలో వారం రోజులుగా గ్రామ దేవతలకు పండగలు చేసిన సందర్భంగా చివరి రోజున ముత్యాలమ్మకు, లక్ష్మమ్మకు, దుర్గమ్మకు, మైసమ్మకు, నల్ల పోచమ్మకు, పోలేరమ్మకు గ్రామ పెద్దలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలో బోనాలు ఊరేగింపుగా తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేసి జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.అనంతరం గ్రామంలో భక్తులకు ఆలయ కమిటీ వారు అన్నదాన వితరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పంభాల జ్యోతి శ్రీనివాస్ మరియు ఆలయ కమిటీ సభ్యులు వివిధ గ్రామాలకు చెందిన భక్తులు గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.