Reporter -Silver Rajesh Medak.
తేది-25/05/2024.
రైతు దేశానికి వెన్నెముక
నకిలీ విత్తనాల సరఫరాను, నాసిరకం ఎరువులను అరికట్టేందుకు పటిష్ట చర్యలు.
నకిలీ విత్తనాలను అరికట్టేందుకు మండలాల వారీగా ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలు.
జిల్లా ఎస్.పి డా.శ్రీ.బి.బాలస్వామి ఐ.పి.యెస్. ….
జిల్లాలో ఎవరైనా నకిలీ విత్తనాలను,ఎరువులు, నాసిరకం పురుగుల మందులను అమ్ముతూ రైతులను మోసం చేసే వారిపై పై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్.పి.డా.బి.బాలస్వామి ఐపిఎస్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. రైతు దేశానికి వెన్నెముక అని ఆరుగాలం కష్టించి దేశం కడుపు నింపే రైతులను మోసం చేస్తూ దళారులు కొంతమంది నకిలీ విత్తనాలు సరఫరా చేసి రైతులను అప్పుల అగాధంలోకి నెట్టబడుతున్నారని వారి కుటుంబాలను ఆర్థికంగా చిన్నాభిన్నం చేస్తున్న నకిలీ విత్తనాల సరఫరా, నాసిరకం ఎరువులు కొనుగోలు మరియు విక్రయాలపై మరింత కఠినంగా వ్యవహరిస్తున్నట్లు ఎస్పీ గారు తెలిపారు. జిల్లాలో పోలీసు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తూ పక్కా సమాచారంతో ఎవరైనా నకిలీ విత్తనాల సరఫరా, విక్రయాలు జరిపితే వారిపై దాడులు నిర్వహిస్తామని ఈ సంధర్భంగా హెచ్చరించారు.
జిల్లాలో రైతులకు ఎవరైనా నకిలీ విత్తనాలను సరఫరా చేసిన, నాసిరకం ఎరువులను విక్రయించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్.పి.డా.బి.బాలస్వామి ఐపిఎస్ గారు తెలిపారు. అలాగే రైతులు నష్టపోకుండా వ్యవసాయ శాఖ అధికారులు ధ్రువీకరించిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని, వ్యాపారస్తుల నుంచి తీసుకున్న బిల్లులు కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలని రైతులకు సూచించారు. నకిలీ విత్తనాలను అరికట్టడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను నియమించామని వారి ద్వారా మండలాల వారీగా వ్యవసాయ అధికారులతో కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహిస్తామని తెలిపారు. నకిలీ విత్తనాలను పూర్తిస్థాయిలో నిర్మూలించడానికి ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేశామని తెలిపారు. నకిలీ విత్తనాలను, ఎరువులు, నాసిరకం పురుగుల మందులను ముందుగా గుర్తించడం అడ్డుకోవడం కట్టడి చేయడం, వారు ఎక్కడి నుండి సరఫరా చేస్తున్నారు ప్రైమరీ కాంటాక్ట్, తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు జిల్లా ఎస్.పి.డా.బి.బాలస్వామి ఐపిఎస్ గారు తెలిపారు. ప్రతి గ్రామంలో పోలీసు అధికారులు వ్యవసాయ రైతులకు అవగాహన కార్యక్రమలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా తక్కువ ధరకు పత్తి విత్తనాలు కానీ ఇంకా ఏమైనా విత్తనాలు కానీ ఇస్తామని మాయమాటలు చెప్పి విక్రయించడానికి వచ్చిన వారి వివరాలను పోలీసువారికి సమాచారం ఇవ్వాలని తెలిపారు. నకిలీ విత్తనాల పట్ల ప్రతి ఒక్క రైతు అప్రమత్తంగా ఉండాలని జిల్లాలో నకిలీ విత్తనాల గురించి ఎటువంటి ముందస్తు సమాచారం తెలిసిన వెంటనే డయల్ 100 కి కాల్ చేసి పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్ అధికారులు ఫర్టీలైజర్ షాప్ ల పైన ఆకస్మికంగా దాడులు చేసి ప్రతి షాప్ ను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి షాపుల యజమానులకు నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులు ఎవరైనా అమ్మితే వారిపైన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. కాబట్టి విత్తన మరియు ఫర్టీలైజర్ షాప్ ల యజమానులు రైతులకు నాణ్యమైన విత్తనాలను, ఎరువులను విక్రయించాలని తెలిపినారు.