Reporter -Silver Rajesh Medak.
తేది -మే,25, 2024.
సేవా ధోరణితో మీసేవ కేంద్రాలు పని చేయాలి.. అదనపు చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు
ఆధార్ సెంటర్స్ సమస్యలు,
స్త్రీ నిధి ,వన్ స్టాప్ సర్వీసెస్
సేవలపై రివ్యూ సమావేశం
ఈ డిస్టిక్ మేనేజర్ సందీప్
ప్రజాసేవ కర్తవ్యం గా మీసేవ సెంటర్లు పనిచేయాలని ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ సందీప్ తెలిపారు. శనివారం సమీకృత కలెక్టర్ కార్యాలయంలో యన్ ఐ సి హాల్ నందు E.N.D కమిషనర్ ఆదేశాలు, జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు ఆధార్ సెంటర్లో సమస్యలు, వన్ స్టాప్ సర్వీసెస్, ఆధార్ సెంటర్స్ సమస్యలు, స్త్రీ నిధి ,వన్ స్టాప్ సర్వీసెస్ సంబంధిత విషయాలపై మీసేవ కేంద్రాల , వన్ స్టాప్ సెంటర్ ఆధార్ సెంటర్ నిర్వాహకులతో ఈ డిస్టిక్ మేనేజర్ సందీప్ సమీక్షించారు.
ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేస్తూ సేవా దృక్పథంతో మీసేవ కేంద్రాలు పని చేయాలని ప్రభుత్వం పొందుపరిచిన ధరలను సమాచార బోర్డు ఏర్పాటు చేసి ఆ ధరలకే ప్రజల సేవలను అందించాలన్నారు ఆధార్ సమస్యలు లేకుండా చూడాలని ప్రతి ఒక్కరికి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వడం జరిగిందని మీసేవ కేంద్రాల పనితీరును జిల్లాలో ఆకస్మికంగా ఎప్పుడైనా తనిఖీ చేయవచ్చని తనిఖీ చేసినప్పుడు ప్రజల నుండి ఫిర్యాదులు అందినట్లయితే ఎటువంటి చర్యల కైనా వెనుకాడబోమని చెప్పారు మీసేవ కేంద్రాలకు ప్రజలు వచ్చినప్పుడు వారితో క్రమశిక్షణగా మెలగాలని, సమావేశంలో చర్చించిన అంశాలను ప్రతి ఒక్కరు మీసేవ సెంటర్లో అమలుపరిచి సేవా దృక్పథంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డి ఎం టి ఎస్ టి ఎస్ శశికాంత్, డి ఎం సి ఎస్ సి
స్త్రీ నిధి , మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.