రామాయంపేట స్టూడియో10 టీవీ ప్రతినిధి) మే 26:- కామారెడ్డి మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే మార్గంలో గజ్వేల్ రైల్వే స్టేషన్ మధ్యలో రామాయపల్లి గ్రామం దగ్గర్లో రైల్వే ట్రాక్ పక్కన ఒక గుర్తు తెలియని వ్యక్తి అందాజ 55 నుండి 60 సంవత్సరాల మధ్య ఉంటాడని తెలిపారు.అతని వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని పేర్కొన్నారు.రామాయపల్లి వద్ద గుర్తు తెలియని వ్యక్తి రైలుకు ఎదురుగా వెళ్లి డీకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలుస్తోందన్నారు.ఈ వ్యక్తిని ఎవరైనా గుర్తుపట్టినట్లయితే కామారెడ్డి రైల్వే పోలీసులను సంప్రదించాలని తెలిపారు.ఈ మేరకు క్రైమ్ నెంబర్ 112/2024 OPC RPS NZB U/S 174 KM NO 4/4-5 క్రింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కామారెడ్డి రైల్వే ఎస్సై తార్య నాయక్ తెలిపారు.