నార్సింగి : మండల పరిధిలోని వల్లూరు గ్రామ శివారులో జాతీయ రహదారి 44 పై ఉన్న రాజస్థానీ జోధపూర్ ఢాబా లో శుక్రవారం ఉదయం 2:30 ప్రాంతం లో మాధవ్ పూర్, సికార్ జిల్లా రాజస్థాన్ కు చెందిన లారీ డ్రైవర్ మనోజ్ కుమార్ (34) తన కంటైనర్ లారీ జీజే 17యు యు 8921 ను ఢాబా లో నిలిపాడు. అనంతరం ఢాబా లో స్నానం చేసి భోజనం చేసి తన లారీ లో పడుకున్నాడు. తెల్లారేసరికి రాత్రికి వచ్చిన వాహనాలు అన్ని వెళ్ళిపోయినా, మనోజ్ కుమార్ వాహనం వెళ్లక పోవడం తో ఢాబా యజమాని అయిన బిష్ణోయి మనీష్ లారీ వద్దకు వెళ్ళి చూడగా మనోజ్ కుమార్ పడుకుని కనిపించాడు. ఎంత పిలిచినా పలకరించ పోయేసరికి అనుమానం వచ్చి లారీ ఎక్కి చూడగా అతను మృతి చెంది ఉన్నాడు. ఢాబా యజమాని విషయాన్ని వెంటనే నార్సింగి పోలీసులకు తెలియ పరచగా ఎస్ఐ అహ్మద్ మోహిఉద్దిన్ తన సిబ్బంది తో ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. లారీ డ్రైవర్ మనోజ్ కుమార్ నిద్రలో గుండె పోటు రావడం తో మృతి చెందాడని ప్రాధమిక విచారణ లో తేల్చారు. మృత దేహాన్ని రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఢాబా యజమాని బిష్ణోయి మనీష్ ఫిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.