నవీపేట్ మండల కేంద్రంలో : అమ్మ ఆదర్శ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను. పరిశీలించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నేడు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగిందని, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోని చేర్పించాలని బోధన్ శాసన సభ్యులు పి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మండల కేంద్రమైన నవీపేట్ మండల్ బాలుర, బాలిక పరిషత్ పాఠశాలతో పాటు, రెంజల్ జిల్లా,నీలా జిల్లా పరిషత్ పాఠశాలలో మౌలిక సదుపాయాల ఏర్పాట్ల గురించి ఆయన అధికారులతో చర్చించారు. పాఠశాలల అభివృద్ధి కోసం స్థానిక రైతులు ముందుకు వచ్చి మొరం పనులను చేపట్టాలని ఆయన సూచించారు. ప్రతి రైతు కనీసం మూడు ట్రాక్టర్ల మొరం తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని స్థానిక నాయకులకు ఆదేశించారు. పాఠశాలల్లో చిన్నచిన్న మరమ్మత్తులన్నీ పూర్తి చేయాలని ఆయన పంచాయతీరాజ్ డిఈ రాజయ్య ను ఆదేశించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు నో పదవ తరగతి ఉత్తీర్ణత శాతం గురించి అడిగి తెలుసుకుని ఆయనను అభినందించారు. 100% విద్యార్థులు తీర్నతతో పాటు 9.5 జీపీఏ రావడం సంతోషకరమని ఆయన స్పష్టం అంగన్వాడి కేంద్రంలో చదివిన విద్యార్థులు అందరిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. ప్రైవేట్ పాఠశాలలలో అధిక ఫీజులు చెల్లించే అవకాశం లేకుండా ప్రభుత్వ పాఠశాలలలోనే అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో భోజన కొనసాగు తోందన్నారు. స్థానిక ప్రజలు ఉపాధ్యాయులకు సహకరించాలని ఆయన పేర్కొన్నారు.