వెంకట్రాంరెడ్డి లక్ష మెజార్టీతో గెలుపు తథ్యం…

నిరుపేద విద్యార్థులకు 100 కోట్ల రూపాయలతో ట్రస్ట్ ఏర్పాటు…

బిఆర్ఎస్ యువ నర్సంపల్లి పెద్ద తండా అధ్యక్షులు భాష నాయక్

నార్సింగి.. మెదక్ పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి లక్ష మెజారిటీతో గెలవడం ఖాయమని. నార్సింగి మండలం నర్సంపల్లి పెద్దతండ బిఆర్ఎస్ యువజన అధ్యక్షులు బాషా నాయక్ అన్నారు. వెంకట్రాంరెడ్డి గెలిచిన వెంటనే 100 కోట్ల రూపాయలతో ట్రస్ట్ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. అదేవిధంగా సంవత్సరం లోపుగా ప్రతి నియోజకవర్గంలో ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసి ఒక్క రూపాయి కిరాయితో పెళ్లిళ్లకు ఇతరత్రా కార్యక్రమాలకు ఫంక్షన్ హాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. బిజెపి కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎన్నికలలో రెండు పార్టీలకు ఓటమి ఖాయమన్నారు. మాజీ సీఎం కేసీఆర్ చేపట్టినటువంటి బస్సు యాత్రకు తెలంగాణ ప్రజలు జననిరాజనం పలికారని. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి బిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని బిఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి లక్ష మెజార్టీతో గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!