నార్సింగి : రాష్ట్ర ప్రభుత్వం గతం లో ఎస్సీ కార్పొరేషన్ కు సంబంధించిన లోన్లు మార్చ్ లో విడుదల చేసేదని, కానీ సంవత్సరాలు గడుస్తున్న లోన్ల విషయం పట్టించుకోవడం లేదని మాలల హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మల మైసయ్య, చేగుంట మండల అధ్యక్షుడు చింత కింది బాల ఎల్లం, నార్సింగి మండల అధ్యక్షుడు చింతల మల్లేష్ లు మండి పడ్డారు. మండల కేంద్రంలో విలేకరులతో వారు మాట్లాడుతూ 2021,22,23 సంవత్సరాలలో కార్పొరేషన్ కు సంబంధించిన కొన్ని బిల్లులు రాలేదని, అప్పటి నుంచి ఇప్పటివరకు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇవ్వడం లేదని, గతంలో ఉన్న ప్రభుత్వం హయాంలో లోన్ల విషయంలో నిర్లక్ష్యం జరిగాయని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న బిల్లులను రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఈ సంవత్సరము ఎస్సీ కార్పొరేషన్ లోన్లు దరఖాస్తులు చేసుకోవడానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, అదేవిధంగా ఎస్సీలకు సంబంధించిన విద్య కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం అందించవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఎస్సీలకు అందవలసిన సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. గృహలక్ష్మి, ఒంటరి మహిళలకు పింఛన్, ప్రభుత్వం ఏర్పాటు జరిగి ఇంత సమయం గడిచినా కొత్త పింఛన్లు ఇవ్వడం లేదని, వెంటనే పింఛన్లను, ఇండ్లను మంజూరు చేయవలసిందిగా కోరారు.