కూరగాయల మార్కెట్ ను ఎత్తివేయాలని సిఎస్ఐ చర్చి నివాసుల ఆందోళన,,,,,
త్వరలో కూరగాయల మార్కెట్ ను నిర్మాణం చేపట్టాలని వ్యాపారస్తుల డిమాండ్,,,,,
రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) మే 18:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని సిఎస్ఐ చర్చిలో వాచ్మేన్ గా పని చేస్తున్న శివునూరు గ్రామానికి చెందిన మార్కు అనే యువకున్ని రామాయంపేట పట్టణానికి చెందిన తైబజార్ నిర్వాహకుడు కొట్టడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వెంటనే చర్చి ఆవరణలో ఉన్న కూరగాయల మార్కెట్ ను తీసివేయాలని చర్చి ఆవరణలో ఉంటున్న నివాసులు ఆ షాపులను తొలగించడం జరిగింది. తమ ఆవరణలో ఉంటున్న దుకాణాల నుండి తైబజర్ వసూలు చేయడంతో పాటు తమకు సంబంధించిన వ్యక్తిని కొట్టడం పట్ల చర్చి నివాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చి ఆవరణలో ఏ ఒక్క కూరగాయ దుకాణాలు కూడా ఉండవద్దని వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన కూరగాయ దుకాణ నిర్వాహకులు వారిని ప్రాధేయపడి బతిమిలాడడం జరిగింది. తాము ఏలాంటి తప్పు చేయలేదని ఆ గొడవకు తమకు ఎలాంటి సంబంధం లేదని వారు వేడుకున్నారు. ఈ విషయాన్ని కూరగాయల వ్యాపారులు రామాయoపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని వారు తెలిపారు. ఆ తర్వాత ఇరుపక్షాలతో చైర్మన్ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడి విషయాన్ని సర్ది చెప్పారు. దీంతో ఇరు పక్షాలు సద్దుమణిగాయి. దాంతో కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులు ఆందోళనకు దిగి తమకు త్వరలో కూరగాయల మార్కెట్ నిర్మాణమును అధికారులు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.