వెంకటాపూర్ లో బాధిత కుటుంబాలను పరామర్శించిన పంజ విజయ్ కుమార్
రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) మే 18:- మెదక్ జిల్లా నిజాంపేట జడ్పిటిసి మెదక్ నియోజక వర్గ బిజెపి ఇన్చార్జి పంజ విజయ్ కుమార్ ఇటీవల రామాయంపేట మండలం ఆర్ వెంకటాపూర్ గ్రామంలో జరిగిన బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం ద్వంసం విషయంలో అనుమానితులుగా భావిస్తు 20 రోజులుగా జైలు శిక్ష అనుభవిస్తున్న కమ్మరి హరీష్ గిద్దె ఆనంద్ అబ్రమైనా భానుతేజ, భరత్ కుమార్ క్యాధరి నరేందర్ కుటుంబాలను పరామర్శించి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. భరత్ కుమార్ నానమ్మ దశదిన కర్మ కార్యక్రమానికి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం 50 కేజీల బియ్యం ఇవ్వడం జరిగింది. ఈ బాధిత కుటుంబ సభ్యులను కలిసినపుడు 20 రోజులుగా కుటుంబాలు శోకంలో నిండిపోయాయి. ఇలాంటి సున్నితమైన సమస్యను గ్రామ పెద్దలు ప్రజలందరు శాంతి యుతంగా పరిష్కరించుకోవాలని అన్నారు. అనంతరం గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహనికి పూల మాలలు వేసి ఆయనను స్మరించుకున్నారు. ఆయన వెంట బిజెపి మండల అధ్యక్షులు దయానంద రెడ్డి, సీనియర్ నాయకులు నవాత్ రాజేంద్ర ప్రసాద్, సిద్దరాంరెడ్డి, పంజ బాబు, ప్రధాన కార్యదర్శి నవీన్ గౌడ్, భరత్ కుమార్, లక్ష్మణ్, రాజి రెడ్డి నాయకులు పాల్గోన్నారు.