స్టూడియో 10 టీవీ మెదక్ జిల్లా ప్రతినిధి (సిల్వర్ రాజేష్.)
తేదీ 17-5-2024
మెదక్
ఇంటర్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు పక్డ్బందీ గా నిర్వహించాలి. జిల్లా అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు .
ఈనెల 24 నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ అడ్వాన్స్స్ సప్లమెంటరీ వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేయవలసినదిగా జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్ లోని అదనపు కలెక్టర్ ఛాంబర్ లో ఇంటర్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై ఇంటర్ విద్యాధికారి సత్యనారాయణ తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు మాట్లాడుతూ అత్యంత జాగరూకతతో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని, ఏ చిన్న పొరపాటు జరిగినా విద్యార్ధుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని అన్నారు.
పరీక్షలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రం లోకి చేరుకోవాలని, ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ పై సమీక్షిస్తూ, మే 24 నుండి జూన్ 3 వరకు జరుగుతాయని,ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరిక్షలకు జిల్లాలో 6,110 మంది విద్యార్థులు హాజరవుతున్నారని, ఇందులో మొదటి సంవత్సరంలో 3,812 మంది విద్యార్థులు, రెండవ సంవత్సరంలో 2,298 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని అన్నారు.. ఇందుకోసం 22 కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ప్రతి కేంద్రంలో సి.సి.కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, 22 చీఫ్ సూపరింటెండెంట్లు. 22 శాఖాధికారులతో పాటు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్, 4 సిట్టింగ్ స్క్వాడ్, 4 కస్టడీయ్సన్ టీములు ఏర్పాటు చేశామని వీరు పరీక్షల నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని అన్నారు.
ప్రశ్న పత్రాల స్టోరేజికి 13 పాయింట్లు ఏర్పాటు చేశామని తెలిపారు.
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించుటకు పోలీస్ శాఖ ప్రశ్న ప్రత్రాల స్టోరేజి, తరలింపు లో, పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించాలని, పరీక్షా సమయంలో జీరాక్స్ సెంటర్లు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్ధులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు హాజరయ్యేలా ఆర్టీసీ అధికారులు బస్సులను నడపాలని, వైద్య అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్స్, మందులతో మెడికల్ పాయింట్ ఏర్పాటు చేయాలని, విద్యుత్ లో అంతరాయo కలుగకుండా చూడాలని విద్యుత్ శాఖాధికారులను ఆదేశించారు. పోస్టల్ శాఖ వారు జవాబు పత్రాలను సరిగా రిసీవ్ చేసుకోనీ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలని సూచించారు.
పరీక్షా కేంద్రాలలో మంచినీరు, ఫాన్స్, టాయిలెట్స్ ఏర్పాట్లు సరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. విద్యార్థులు ఎలక్ట్రానిక్ గాడ్జెస్ వంటివి తీసుకురాకుండా తనిఖీ చేసి సమీపంలోని కలెక్టింగ్ పాయింట్ లో డిపాజిట్ చేయాలనీ, తమ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని ఇంటర్మీడియట్ అధికారులకు అదనపు కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో డీఎస్పీ డా: రాజేష్ ఆర్.టి.సి మేనేజర్ సుధా , విద్యుత్,పోస్టల్ , తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.