రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) మే 17:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని ఎస్సీ కాలనీలో శుక్రవారం రోజు అకాల వర్షాలకు తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తూ రామాయంపేట-సిద్దిపేట ప్రధాన రహదారిపై రైతులు ఆందోళన చేస్తూ బైఠాయించి రాస్తారోకో చేపట్టారు.రైతుల రాస్తారోకోతో సిద్దిపేట రహదారిపై వాహనాలు గంట పాటు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత నెల రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం ఆరబోసుకుని నానా ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగం వెంటనే ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయమును తెలుసుకున్న రామాయంపేట పోలీసులు రైతులు రాస్తారోకో చేస్తున్న వద్దకు వెళ్లి రైతులను సముదాయించి శాంతియుతంగా రాస్తారోకోను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట పట్టణ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.