రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) మే 17:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటైన డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు విద్యార్థులు ఆన్లైన్ దోస్తు ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని రామాయంపేట పట్టణ జేఏసీ నాయకురాలు పోచమ్మల అశ్విని అన్నారు. ఆమె స్థానిక విలేకరులతో శుక్రవారం మాట్లాడుతూ గత సంవత్సరం రెవెన్యూ డివిజన్ కోసం డిగ్రీ కళాశాల కోసం ఉద్యమం చేసి మనము సాధించుకున్నామన్నారు. రామాయంపేటలో మనకు రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసిందని ఈ కళాశాలలో బిఎ బీకాం బీఎస్సీ సబ్జెక్టు కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.కాబట్టి దూర ప్రాంతాలకు వెళ్లకుండా డివిజన్ పరిధిలోని నిజాంపేట నార్సింగి చిన్నశంకరంపేట రామాయంపేట మండలాల విద్యార్థులు కోరుకున్న డిగ్రీ కళాశాల మనకు ఏర్పాటయింది.కాబట్టి మన బాలికలు బాలుర విద్యార్థులను ఈ డిగ్రీ కళాశాలలో చదివించేందుకు తల్లిదండ్రులు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.అదే విధంగా ఇక్కడ ఉన్న డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ హుస్సేన్ విద్యార్థుల చదువు విషయంలో చాలా శ్రద్ద తీసుకొని విద్యార్థులకు మంచి బోధన అందించాలనే ఉద్దేశంతోనే ఆయన ముందుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల చదువుకు అనుభవజ్ఞులైన లెక్చర్లలతో విద్యాబోధన చేయడం జరుగుతుందన్నారు.ఈ డిగ్రీ ప్రవేశాల కోసం ఆన్లైన్ దోస్తు ద్వారా ఈనెల 29 వరకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మిగతా పూర్తి వివరాలు కోసం 9059058286,9492475576 నెంబర్లలో విద్యార్థులు సంప్రదించవచ్చని తెలిపారు.