మెడిసిన్స్ ధరలు తగ్గించిన కేంద్రం
మధుమేహం, గుండె, కాలేయ జబ్బులు వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగించే మందులు సహా 42 రకాల ఔషధాల ధరలను కేంద్రం తగ్గించింది.
యాంటిసిడ్స్, మల్టీ విటమిన్, యాంటీ బయాటిక్స్ ధరలను తగ్గించింది.
తగ్గిన ధరలను డీలర్లు, స్టాకిస్టులకు వెంటనే అందించాలని ఫార్మా కంపెనీలను ఆదేశించింది.
ధరల తగ్గింపుతో 10 కోట్లకుపైగా షుగర్ వ్యాధిగ్రస్థులు లబ్ధి పొందనున్నారు.
ప్రపంచంలోనే అత్యధిక మంది షుగర్ వ్యాధిగ్రస్థులు ఉన్న దేశాల్లో భారత్ ఒకటి.