మెదక్ జిల్లా ప్రతినిధి (సిల్వర్ రాజేష్).
తేదీ 16-5-2024
మెదక్ జిల్లా.
రైతులు అధైర్య పడొద్దు జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు.
ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం
ఈ నెలాఖరి వరకు ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తాం
రవాణా కోసం అదన వాహనాల ఏర్పాటు
రైతుల అధైర్య పడొద్దు అండగా ఉంటం
స్థానిక చిలిపిచెడ్ మండలంలోని చిట్కుల్ ,చండూర్ ,కొల్చారం మండలంలోని చిన్న ఘనపూర్ గ్రామాల్లో దాన్యం కొనుగోలు సెంటర్ ను గురువారం జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ధాన్యం కొలుగోలులో రైతుల అధైర్య పడద్దని రైతులకు అండగా ఉంటామని, ధాన్యం చివరి గింజ వరకు కొంటామని, జిల్లాలో ధాన్యం సేకరణ కోసం అదనపు వాహనాలు సమకూర్చామన్నారు. జిల్లాలో ధాన్యం సేకరణ ఈనెల ఆఖరి వరకు పూర్తి చేస్తామన్నారు. ధాన్యం కొనుగోలులో రవాణా కోసం ఇతర జిల్లాల నుంచి అదనపు వాహనాలు తెప్పించామని, అదనపు వాహనాలలో లోడింగ్ నడుస్తుందన్నారు. దళారులను నమ్మొద్దని, కొనుగోలు కేంద్రంలో అన్ని సౌకర్యం కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై అధికారి హరికృష్ణ ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.