నేను చనిపోతానేమో అని భయమేస్తుందంటూ.. బోరున ఏడుస్తున్న బర్రెలక్క (వీడియో)

స్టూడియో 10టీవీ

నవీపేట్ రిపోర్టార్ సురేందర్

తేది :14-5-2024

నేను చనిపోతానేమో అని భయమేస్తుందంటూ.. బోరున ఏడుస్తున్న బర్రెలక్క (వీడియో)
సోషల్ మీడియా ద్వారా పలు వీడియోలు, రీల్స్ చేసి ఎంతో మంది సెలబ్రిటీలుగా మారిపోయిన వారిలో బర్రెలక్క ఒకరు.సోషల్ మీడియా ద్వారా పలు వీడియోలు, రీల్స్ చేసి ఎంతో మంది సెలబ్రిటీలుగా మారిపోయిన వారిలో బర్రెలక్క ఒకరు.

ఆమె ఎన్ని చదువులు చదివినా చివరికి గవర్నమెంట్ ఉద్యోగాలు రావు బర్రెలు కాయడమే అనే వీడియోతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ వీడియో క్షణాల్లో వైరల్ కావడంతో బర్రెలక్క ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిందనడంతో అతిశయోక్తి లేదు. అలాగే గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బర్రెలక్క (శిరీష) పోటీ చేసింది. దీంతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది కానీ విజయం సాధించలేకపోయింది. ఇటీవల బర్రెలక్క పెళ్లి చేసుకుని నిత్యం పలు వీడియోలు షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తుంది.

అలాగే ఎంపీ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే నామినేషన్ కూడా దాఖలు చేసి ప్రచారంలో పాల్గొని వీడియోలను షేర్ చేసింది. అయితే పోలింగ్‌కు ఒక్కరోజు సమయం ఉండగానే నేను చనిపోతానేమో అని భయమేస్తుందంటూ తాజాగా, పోస్ట్ పెట్టింది. ‘‘ నేను మరో గీతాంజలి లాగా బలి అవుతానేమో అనిపిస్తుంది. మీరు మీ ఆనందం కోసం కంటెంట్ కోసం చేసే వీడియోల వల్ల ప్రాణాలు పోతున్నాయి. నేను నా ఫ్యామిలీ ఈ రోజు బాధపడుతున్నాము. మీ నెగిటివ్ ట్రోల్స్ వల్ల మానసికంగా వేధిస్తున్నారు. అలాగే నెగిటివ్ ట్రోల్స్ చేసి మెసేజ్ చేసి హింసిస్తున్నారు. ఇలా ట్రోల్స్ చేసే వాల్లకు ఇది ఎంటర్‌న్మెంట్ కావొచ్చు. కానీ ఎదుటి వాళ్ల జీవితం.

ఇలా చాలా మంది జీవితాలు నాశనం అయ్యాయి. అందులో నాది కూడా ఒకటి. నేను చేసిన తప్పు ఏముంది అర్థం కావట్లేదు. కానీ ఇలా ట్రోల్స్ వల్ల నా ఫ్యామిలీ నేను చాలా బాధపడుతున్నాము. నేను అలాంటి వారిని వదిలిపెట్టను నన్ను నెగిటివ్‌గా ట్రోల్స్ చేసిన వారి మీద కంప్లైంట్ చేస్తున్నాను. ట్రోలింగ్స్ బ్యాడ్ కామెంట్స్ అన్ని నేను భరించలేక పోతున్నా. అయితే ఎంపీ ఎలక్షన్స్ వేసినందుకు కూడా నన్ను ఎంత ఘోరంగా హింసిస్తున్నారంటే. అంత ఘోరంగా కామెంట్స్‌తో బాధపెడుతున్నారు. నేను బాగా విసుగు చెంది పోయాను. ఒక్కోసారి అనిపిస్తుంది నేను చచ్చిపోతానేమో ఏమైనా చేస్కొని అని భయమేస్తుంది. ఇప్పుడే లైఫ్ స్టార్ట్ చేశాను. కొత్తగ నా భర్తతో ఉన్నాను. కానీ నన్ను సంతోషంగా బతకనిస్తలేరు. ట్రోల్స్, కామెంట్స్ నన్ను చాలా బాధిస్తున్నాయి.

ఏదో ఎంపీ ఎలక్షన్స్ వేసాను కాబట్టి అవి కంప్లీట్ అయ్యాక ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి వాటికి దూరంగా ఉంటాను. వీటన్నింటిని తీసేసి నా భర్తతో హ్యాపీ గా ఉండాలనుకుంటున్నాను. నన్ను ట్రోల్స్ చేసే అన్నలు, అక్కలు కానీ నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. మీ ఎడమ కాలు చెప్పు తీసుకుని కొట్టండి కానీ నన్ను ట్రోల్స్ చేయకండి. వాటి వల్ల నేను మానసికంగా చాలా కుంగి పోవాల్సి వస్తుంది. నెక్స్ట్ పొలిటికల్ లైఫ్ కూడా ముగిస్తున్నాను. నాకేం అర్థం అయిందంటే.. ఇక్కడ మంచి చేయడానికి వచ్చిన వాళ్లకు స్థానం లేదని అర్థమైపోయింది. అన్నింటికీ ఎండ్ చెప్పి నా లైఫ్‌లో నేను సంతోషంగా గడపాలనుకుంటున్నాను థాంక్స్’’ అంటూ చెప్పుకొచ్చింది. అలాగే ఈ కామెంట్స్ చేస్తున్నంత సేపు బోరున ఏడ్చింది. దీనికి సంబంధించిన వీడియో షేర్ చేయడంతో అంతా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. అలాగే కొందరు ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!